రాజ్యసభలో క్రిప్టోకరెన్సీ పై రభస.. ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానాలు ఏంటంటే ?

First Published Nov 30, 2021, 4:25 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుండే క్రిప్టోకరెన్సీలపై ప్రశ్నలు సమాధానాలు ప్రారంభమయ్యాయి. క్రిప్టోకరెన్సీపై కొత్త బిల్లు రూపొందిస్తున్నట్లు, ఆమోదం కోసం త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు రాజ్యసభకు తెలిపారు.
 

క్రిప్టోకరెన్సీపై నిర్మలా సీతారామన్  కీలక వ్యాఖ్యలు:

"క్రిప్టోకరెన్సీ రిస్క్, తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా మానిటర్ చేయబడుతోంది" అని ఆర్థిక మంత్రి ఈరోజు రాజ్యసభలో తేలిపారు. అయితే ప్రభుత్వ రెగ్యులేషన్ పై పరిశ్రమ ఎదురుచూపుల మధ్య ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

"క్రిప్టోకరెన్సీ పై కొన్ని ఇతర కోణాలు ఉన్నాయి, బిల్లును మళ్లీ సవరించాల్సి  వచ్చింది. ఇప్పుడు మేము కొత్త బిల్లుపై పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము" అని నేడు చెప్పారు. ఆర్‌బిఐ, సెబి, ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటనలను ఉటంకిస్తూ పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని కూడా నొక్కి చెప్పారు.

క్రిప్టో బిల్లు వచ్చే వరకు తప్పుదారి పట్టించే ప్రకటనలను నిషేధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా ? అని బీహార్ మాజీ ఆర్థిక మంత్రి సుశీల్ మోడీని ప్రశ్నించగా ఆమె "ఈ సమస్యపై ఒక వైఖరిని తీసుకోవడానికి ప్రకటన మార్గదర్శకాలు పరిశీలించబడుతున్నాయి."అని అన్నారు.

NFTలపై కేంద్రం ప్రత్యేక రూల్స్, ఐడియాస్ ఇతర  తీసుకువస్తుందా (నాన్-ఫంజిబుల్ టోకెన్) ? "ఈ సమయంలో దీనిపై ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుందో లేదో నేను చెప్పలేను. అయితే ఈ విషయాలన్నీ చర్చించబడుతున్నాయి," అని సుశీల్ మోడీ ప్రశ్నను ఆమె బదులిచ్చారు.

క్రిప్టోకరెన్సీపై ఎంత మంది ఆదాయపు పన్ను చెల్లించారనే ప్రశ్నపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మాట్లాడుతూ, క్రిప్టోకరెన్సీపై ఎంత పన్ను వసూలు చేశారన్న సమాచారం నా వద్ద లేదు అని తెలిపారు.
 

ప్రకటనల మీద ఆంక్షలు లేవు 
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో  ప్రభుత్వం నుంచి క్రిప్టోకరెన్సీ ఇంకా సంబంధించిన ఏ ప్రకటనలను నిషేధించలేదు  అని ఒక ప్రశ్నకు ఆర్ధిక మంత్రి  బదులిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ద్వారా దీనిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. దీనికి సంబంధించి రూపొందించిన క్రిప్టోకరెన్సీ బిల్లును త్వరలో ప్రవేశపెట్టనున్నారు. 
 

క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాని ప్రమాదాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు. భారత్‌లో క్రిప్టోకరెన్సీకి సంబంధించి మోసాలు జరిగినట్లు ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి ఎనిమిది కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. శీతాకాల సమావేశాల తొలిరోజున బిట్‌కాయిన్ లావాదేవీలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, బిట్‌కాయిన్ లావాదేవీలపై భారత ప్రభుత్వం డేటాను సేకరించడం లేదని ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలిపారు. అలాగే దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన లేదని ఆమె చెప్పారు. 

డిజిటల్ కరెన్సీల వినియోగ కేసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దర్యాప్తు చేస్తోందని, సెంట్రల్ బ్యాంక్  డిజిటల్ కరెన్సీ (CBDC)ని ప్రారంభించేందుకు దశలవారీగా అమలు చేసే వ్యూహంపై పనిచేస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

click me!