అల్ టైం రికార్డు బ్రేక్ చేసిన స్టాక్ మార్కెట్: దీనికి కారణాలను ఈ 10 పాయింట్లలో తెలుసుకోండి..

First Published Sep 24, 2021, 12:23 PM IST

 దేశీయ స్టాక్ మార్కెట్ నేడు అద్భుతమైన అప్‌ట్రెండ్‌ని కొనసాగిస్తోంది. దీంతో ఈ రోజు సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తు మొదటిసారి 60 వేలు దాటింది. నిన్న గురువారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో ముగిశాయి. దీంతో పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి. 
 

స్టాక్ మార్కెట్  రికార్డులకు 10 కారణాలను తెలుసుకుందాం :

1. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు, కానీ రాబోయే రోజుల్లో తగ్గింపు సూచనలు సూచించింది. ఈ కారణంగా విదేశీ పెట్టుబడిదారులలో ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తోంది. 

2. గత రోజుల్లో యు.ఎస్ స్టాక్ మార్కెట్లో బూమ్ కొనసాగింది. డౌ జోన్స్ 1.48 శాతం పెరిగి 34,764 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 1.04 శాతం పెరిగి 15,052 కి చేరుకుంది, ఎస్&పి 500 1.21 శాతం పెరిగి 4,448 కి చేరుకుంది.

3. కరోనా వైరస్ మహమ్మారి  సెకండ్ వేవ్  ని ఎదురుకొంటూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జి‌డి‌పి వృద్ధి రేటు 20.1 శాతంగా ఉంది. మొదటి త్రైమాసికంలో చైనా 7.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసినందున ఇవి చైనా కంటే మెరుగైన గణాంకాలు. అంటే, చైనా కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మెరుగుపడిందని భావించవచ్చు. 
 

4. ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతరం మద్దతు ఇస్తోంది. ఇటీవల టెలికాం రంగానికి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. టెలికాం రంగంలో  ఎన్నో నిర్మాణాత్మక, ప్రక్రియ సంస్కరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు ఉపాధి అవకాశాలను పెంచుతాయి, పోటీని ప్రోత్సహిస్తాయి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయి అలాగే పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తాయి.

5. ఏకకాలంలో విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) నిరంతరం పెరుగుతున్నాయి, ఇది దేశీయ మార్కెట్‌లో విజృంభణకు దారితీసింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెండింతలు పెరిగి 20.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 27.37 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది కూడా దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది.

6. ఇనీషియేటివ్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) మార్కెట్ కూడా ఊపందుకుంది. కంపెనీలు నిరంతరం ఐ‌పి‌ఓలను అందిస్తున్నాయి. ఇది కూడా పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది.  

7. ద్రవ్యోల్బణ డేటా కూడా మార్కెట్‌ని ప్రభావితం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు నెలలో కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ) లో స్వల్ప తగ్గుదల ఉంది. జూలైలో సిపిఐ 5.59 శాతంగా ఉంది, అలాగే ఆగస్టులో 5.30 శాతానికి తగ్గింది.
 

8. ఇన్వెస్టర్లలో కరోనా భయం టీకా కారణంగా ముగిసినట్లు కనిపిస్తుంది. గత వారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు నాడు కరోనా టీకా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈసారి 100 కోట్లకు మించి టీకాలు వేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7 నాటికి రికార్డు  స్థాయిలో టీకాల ద్వారా 100 కోట్ల మార్కును పూర్తి చేయాలనే లక్ష్యంతో కొనసాగుతుంది. 

9. చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్‌గ్రాండే నుండి ఉపశమనం కలిగించే నివేదికలు వచ్చాయి. ఎవర్‌గ్రాండ్ వడ్డీని సకాలంలో చెల్లించనుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా వ్యవస్థలో 18.8 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ .1.41 లక్షల కోట్లు ఉంది, తద్వారా లిక్విడిటీకి కొరత ఉండదు.

10. రెండవ త్రైమాసికంలో కంపెనీల మంచి ఫలితాలు ఆశించనున్నాయి. డాలర్‌తో రూపాయి బలపడటం స్టాక్ మార్కెట్‌కు మద్దతునిచ్చింది. డాలర్‌తో రూపాయి గురువారం 23 పైసలు లాభపడి 73.64 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్‌లో యుఎస్ కరెన్సీ బలహీనత కారణంగా ఇది ప్రభావితమైంది.
 

click me!