మహాభారతం కాలానికి చెందిన ఈ కోట అసలు రహస్యం ఇదే.. దీని కథ వింటే ఆశ్చర్యపోతారు..

First Published Apr 24, 2021, 11:46 AM IST

 భారతదేశాన్ని 'కోటల దేశం' అని పిలిస్తే తప్పు కాదు, ఎందుకంటే పురాతన కాలంలో రాజులు ఇక్కడ చాలా కోటలను నిర్మించారు. భారతదేశంలో చారిత్రక కోట లేని ఏ రాష్ట్రం ఉండదు. 

'భారతదేశపు అతిపెద్ద కోట' అని పిలువబడే ఒక కోట గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దీని నిర్మాణం కథ మహాభారత కాలంతో ముడిపడి ఉంది. ఈ పురాతన కోట గురించి మీకు తెలియని కొన్ని విషయాలు...ఈ కోట పేరు చిత్తోర్‌ఘర్ కోట, ఇది భారతదేశంలోనే అతిపెద్ద కోట అని చెబుతుంటారు. రాజస్థాన్ లోని చిత్తోర్‌ఘర్ ఈ కోట ఉంది. దీనిని రాజస్థాన్ ఫ్రైడ్ ఇంకా రాజస్థాన్ కింగ్ ఆఫ్ అల్ ఫోర్ట్స్ అని కూడా పిలుస్తారు. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న చిత్తోర్‌ఘర్ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2013లో ప్రకటించారు.
undefined
ఈ కోటను చాలా మంది రాజులు వేర్వేరు సమయాల్లో పరిపాలించారు. ఎనిమిదవ శతాబ్దంలో గుహిల్ రాజవంశం వ్యవస్థాపకుడు రాజు బాప్పా రావల్ దీనిని పాలించాడు. అతను మౌర్య రాజవంశం చివరి పాలకుడు మన్మోరీని ఓడించి ఈ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దీని తరువాత పరమారస్ నుండి సోలంకిస్ వరకు ఈ కోటను పాలించారు. అలాగే ఈ కోట అనేక విదేశీ దండయాత్రలకు సాక్ష్యమిచ్చింది, దీని గురించి కథలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
undefined
180 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోటలో అనేక చారిత్రక స్తంభాలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ 75 అడుగుల ఎత్తైన జైన కీర్తి స్తంభం కూడా ఉంది, దీనిని 14 వ శతాబ్దంలో నిర్మించారు. దీని సమీపంలో మహావీర్ స్వామి ఆలయం, కొంచెం దూరంలో నీలకంత్ మహాదేవ్ ఆలయం ఉంది. భీముడు ఈ భారీ విగ్రహాన్ని తన చేతుల్లో కట్టి ఉంచాడని చెబుతారు.
undefined
ఈ కోటలోకి ప్రవేశించడానికి 7 గేట్లు దాటల్సి ఉంటుంది. వీటన్నింటినీ దాటితే అప్పుడు కోట లోపలికి ప్రవేశించవచ్చు. ఈ ఏడు గెట్ల పేర్లు పదన్ పోల్, భైరవ్ పోల్, హనుమాన్ పోల్, గణేష్ పోల్, జోధ్లా పోల్, లక్ష్మణ్ పోల్, రామ్ పోల్. ఇక్కడ ప్రతి గేటుకి ఒక భిన్నమైన కథ ఉంది.
undefined
పురాతన కాలంలో చిత్తోర్‌ఘర్ కోటలో లక్ష మందికి పైగా ప్రజలు నివసించేవారట. రాజు-రాణి నుండి సైనికులు, భటులు, ప్రజల వరకు ఉండేవారు. ఈ గొప్ప కోట మహిళలకు ప్రముఖ ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది.
undefined
ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ కొంతమంది చరిత్రకారులు దీనిని ఏడవ శతాబ్దంలో మౌర్య రాజు చిత్రంగడ్ మౌర్య నిర్మించారని చెపుతారు. మహాభారత కాలంలో నిర్మించిన దీని నిర్మాణం గురించి ఒక కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం భీముడు సంపద కోసం వెతుకుతున్నప్పుడు, అతని మార్గంలో ఒక యోగిని కలిశాడు. భీముడు అతని నుండి ఒక అద్భుతమైన పరాస్ రాయి(ఇనుముని బంగారంగా మార్చే రాయి)ని అడిగాడు. దానికి అంగీకరించిన యోగి ఒక షరతు పెట్టాడు, ఒక్క రాత్రిలోగా కొండపై ఒక కోటను నిర్మించాలని చెప్పాడు. భీముడు దానికి అంగీకరించి అతని సోదరులతో కలిసి కోటను నిర్మించడం ప్రారంభించాడు.
undefined
కోట దక్షిణ భాగంలో కొద్దిపాటి భాగం మాత్రమే మిగిలి ఉండటంతో వారి నిర్మాణం ముగుస్తుంది. యోగి కోట వేగంగా నిర్మించబడటం చూసి భయపడ్డాడు ఎందుకంటే నిర్మాణం తరువాత అతను పరాస్ రాయిని భీముడికి ఇవ్వవలసి ఉంటుంది. దీనిని నివారించడానికి అతను ఒక పరిష్కారం గురించి ఆలోచించి తనతో నివసిస్తున్న యాతిని కోడి లాగా మారి భీముడికి కనిపించేల తిరుగమని అడిగాడు, తద్వారా భీముడు ఉదయం అయ్యిందని అర్థం చేసుకుంటాడు. యాతి కూడా అదే చేసింది. యాతి కోడిలగా కూయడంతో అది విన్న భీముడికి కోపం వచ్చి ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. దీంతో అక్కడ ఒక పెద్ద గొయ్యిని ఏర్పడింది. నేడు ఈ గొయ్యిని అడి-లతాబ్ అని పిలుస్తారు.
undefined
click me!