కరోనా ఎఫెక్ట్: ఇన్షూరెన్స్ కంపెనీల కొత్త నిబంధనలు.. ఇప్పుడు వారికి 3 నెలల తర్వాత మాత్రమే..

First Published Jan 14, 2022, 7:21 PM IST

కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అంటే కోవిడ్-19 (covid-19)ఓమిక్రాన్ (omicron)వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, బీమా కంపెనీలు(insurance companies) ఇప్పుడు కొత్త నిబంధనను అమలు చేశాయి. 

దీని ప్రకారం ఒక వ్యక్తి కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి బీమా పాలసీని పొందలేరు. 

అవును.. నిజమే.. బీమా కంపెనీల కొత్త రూల్ ప్రకారం కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీ కోసం 3 నెలలు వేచి ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇతర వ్యాధుల లాగానే కరోనావైరస్ కేసుల కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీని జారీ చేసే ముందు రిస్క్ అసెస్‌మెంట్ చేయడానికి ప్రజలను కొంత సమయం వరకు వేచి ఉండలని కోరుతున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తులకు ఈ వెయిటింగ్ పీరియడ్ షరతు లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీలదారులపై మాత్రమే వర్తిస్తుంది. 
 

అధిక మరణాల రేటు రీఇన్స్యూరెన్స్ వ్యాపారంపై ప్రభావం చూపుతున్నందున, కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ కేసులకు కూడా స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని రీఇన్స్యూరర్లు బీమా కంపెనీలను కోరారు.
 

ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) ప్రెసిడెంట్ సుమిత్ బోహ్రా మాట్లాడుతూ, భారతీయ బీమా సంస్థలు ఈ నష్టాలన్నింటినీ చూపలేవు. కాబట్టి,   రూ.10-20 లక్షల కంటే ఎక్కువ ఉన్న చాలామంది బీమా పాలసీలు రీఇన్స్యూర్డ్ చేయబడ్డాయి ఇంకా రీఇన్స్యూరర్లు "సిస్టమ్‌లోకి గుడ్ రిస్క్ రావాలని" కోరుకుంటున్నారు, దీని కారణంగా కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ కేసులకు కూడా వెయిటింగ్ పీరియడ్ వర్తింపజేయబడింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తుల కోసం వెయిటింగ్ పీరియడ్ అంటే ఇన్‌ఫెక్షన్ తర్వాత అధిక మరణాల రేటు గురించి బీమా కంపెనీలు అప్రమత్తంగా ఉన్నాయని అర్థం. గత రెండేళ్లలో క్లెయిమ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. తద్వారా పెరుగుతున్న క్లెయిమ్ సెటిల్‌మెంట్ ను నియంత్రించవచ్చు. అధిక మరణాల రేటు రీఇన్స్యూరెన్స్ వ్యాపారాన్ని దెబ్బతీసినందున, కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులను స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ కిందకు తీసుకురావాలని బీమా కంపెనీలు  కోరాయి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లైఫ్ ఇన్సూరన్స్ సంస్థలచే రి ఇన్షూరెన్స్ చేయబడతాయి. 

click me!