Zodiac sign: క‌న్యా రాశిలోకి శుక్రుడి ప్ర‌వేశం.. ఈ 5 రాశుల వారికి మ‌హాయోగం, జస్ట్ రెండు రోజులు ఆగండి

Published : Oct 07, 2025, 11:48 AM IST

Zodiac sign: గ్ర‌హాలు త‌మ స్థానాల‌ను మార్చుకుంటుంటాయి. ఇది ప్ర‌తీ నెల జ‌రిగే స‌ర్వ‌సాధార‌ణ ప్ర‌క్రియ‌. అయితే కొన్ని మార్పులు మ‌న జ్యోతిష్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ కీల‌క మార్పు జ‌ర‌గ‌నుంది. 

PREV
15
కన్యా రాశిలో శుక్ర గ్రహ ప్రవేశం

ప్రతి నెల గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ రాశులపై ప్రభావం చూపుతుంటాయి. అక్టోబర్ నెలలో సంపద, సౌభాగ్యానికి ప్రతీక అయిన శుక్ర గ్రహం కన్యా రాశిలో ప్రవేశించబోతోంది. అక్టోబర్ 9న జరిగే ఈ మార్పు నాలుగు రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలను అందించబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

25
మిథున రాశి: ఆర్థిక లాభం, అప్పుల నుంచి విముక్తి

మిథున రాశి వారికి శుక్రుడు ఈ నెల‌లో అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తగ్గి, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా ప్రోత్సాహకాలు లభించవచ్చు. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది.

35
మీన రాశి: విజయం, శుభప్రయాణాలు

మీన రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా సౌఖ్యం ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల స‌మ‌యంగా చెప్పొచ్చు.

45
వృశ్చిక రాశి వారికి అదృష్టం

వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన కష్టాలు తగ్గుతాయి. అనుకోని మార్గాల్లో ఆదాయం వస్తుంది. కొత్త ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో మంచి పేరు వస్తుంది.

55
సింహ రాశి వారికి లాభాలు

సింహ రాశి వారికి ఖర్చులు పెరిగినా, అంతకు మించి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం జరుగవచ్చు. రియల్టీ రంగం, బిజినెస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది ప‌ర్‌ఫెక్ట్ స‌మ‌యంగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories