October Born: అక్టోబర్ నెల ఆల్రెడీ మొదలైంది. ఈ అక్టోబర్ మాసంలో మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి గొప్పవాళ్లు జన్మించారు. మరి ఈ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇది చదవాల్సిందే..
జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మరి, అక్టోబర్ నెలలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేక లక్షణాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ నెలలో పుట్టిన వారిపై శుక్ర, బుధ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా, వీరు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం కారణంగా అందరినీ తమవైపుకు ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది.
25
స్పెషల్ క్వాలిటీస్...
అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కాస్త మొండితనం కూడా ఎక్కువే. వారు ఏదైనా పని పూర్తి చేయాలి అని అనుకుంటే.. దానిని పూర్తి చేసి తీరతారు. అది పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు. అద్భుతమైన అంకిత భావం కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా.... అందులో రాణించగలరు. ఎక్కడ ఉంటే... అక్కడ అందరితో స్నేహం చేస్తారు. ప్రజాదరణ, గౌరవం, కీర్తి పెరుగుతాయి. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్ , అమితాబ్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ నెలలోనే జన్మించారు.
35
లోపాలు...
అక్టోబర్ లో జన్మించిన వారు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఇతరులను క్షుణ్ణంగా పరిశీలించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కానీ, వారిలోని లోపం ఏంటంటే... ఎదుటి వారి గొప్పతనాన్ని వీరు గుర్తించలేరు. కేవలం లోపాలు మాత్రమే కనిపెడతారు. తమకంటే ఎవరూ గొప్ప కాదు అనే భావన వీరిలో ఉంటుంది. దీని కారణంగా, వారికి అహంకారం పెరుగుతుంది. తాము అందరికంటే ఉన్నతమైన వారు అని ఫీలౌతుంటారు. తమకు రాకపోయినా.. అన్నింట్లోనూ తామే గొప్ప అనే భావన ఉంటుంది. ఇది వీరిలోని అతి పెద్ద లోపం.
ఈ నెలలో జన్మించిన వారు ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని చాలా ప్రేమగా చూసుకుంటారు. వీరిని ఎవరు పెళ్లి చేసుకుంటే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే... తమ లైఫ్ పార్ట్నర్ ని చాలా ప్రేమిస్తారు.. ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అందరి ముందు గౌరవం ఇస్తారు. తమ భాగస్వామి మనసు గెలుచుకుంటారు.
చాలా రొమాంటిక్...
అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే వారి ప్రేమను చెప్పుకోవడానికి ఎప్పుడూ భయపడరు. వారు తమ భాగస్వామికి మద్దతుగా నిలబడటానికి తమ శక్తి మేరకు ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారి భావాలను గాయపరచకపోవడమే మంచిది. అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు తమ సంబంధాలలో చాలా నిజాయితీపరులు. వారి భాగస్వామి నుండి అదే నిజాయితీని కోరుకుంటారు.
55
లగ్జరీ లైఫ్ కోరుకుంటారు...
అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు ఎక్కువ కాలం డబ్బు కలిగి ఉండరు. ఎందుకంటే వారు ప్రయాణాలు , ట్రిప్పుల కోసం చాలా ఖర్చు చేస్తారు. వారు షాపింగ్‌ను ఇష్టపడతారు. వారు ఎల్లప్పుడూ కొత్త స్టైల్స్ ధరించడానికి ఇష్టపడతారు. అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు మరెవరికీ లేని ఖరీదైన వస్తువులను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.
అదృష్ట రంగు, సంఖ్య
సంఖ్యాశాస్త్రం ప్రకారం, అక్టోబర్‌లో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 1, 3 , 8. ఇక వీరి అదృష్ట రంగులు గులాబీ, లేత నీలం.