ఈ రాశి వారు వ‌చ్చే వారం జాగ్ర‌త్త‌గా ఉండాలి.. బంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలు

Published : Nov 16, 2025, 06:59 AM IST

Zodiac sign: సింహా రాశి వారికి న‌వంబ‌ర్ 16 నుంచి 22వ తేదీ వ‌ర‌కు ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిభారం, ఆర్థిక ఒత్తిడి ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. వీరి జీవితంలో జ‌రిగే కొన్ని కీల‌క మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కెరీర్ ఫలితాలు

ఈ వారం ఆఫీస్ పనులు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తే తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. సీనియర్స్ ఎదుట ప్ర‌తిష్ట‌ దెబ్బతినే పరిస్థితి రాకుండా ప్రతి పనిని స్వయంగా చూసుకోవడం మంచిది. మధ్య వారంలో నిర్ణయాలు తీసేప్పుడు గందరగోళం ఉంటుంది. ఒంటరిగా ముందుకు వెళ్లకండి. మీకు న‌చ్చిన వారి సలహా తీసుకుని నిర్ణయం తీసుకోండి.

25
వ్యాపారానికి సంబంధించిన ఫలితాలు

వారం మొదటి భాగం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, విస్తరణ ఆలోచనలకు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. వారం చివర్లో అనుకున్న వేగం తగ్గుతుంది. ఆ సమయంలో రిస్క్ తీసుకోకండి. అత్యవసర ఖర్చులు పెరిగినా, ప్రయాణాలు భవిష్యత్తులో ఉపయోగపడే పరిచయాలు ఇవ్వగలవు. ఈ వారం డబ్బు కన్నా ప్రణాళిక, ఆర్గనైజేషన్ పై దృష్టి అవసరం.

35
కుటుంబ పరిస్థితులు

ఇంట్లో కొన్ని విషయాల్లో శాంతంగా వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయం మీద కఠినంగా ప్రవర్తిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. వారం మ‌ధ్య‌లో చిన్న చిన్న సమస్యలు పెరిగే అవకాశం ఉంది. హడావుడి వద్దు. సహనంతో పరిష్కారం కనుగొనాలి.

45
ప్రేమ సంబంధాలు

ప్రేమ బంధాల‌కు కూడా ఈ వారం అంత‌లా క‌లిసిరాదు. దంప‌తుల మ‌ధ్య మాటతీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గట్టిగా మాట్లాడినా తప్పులు పెరిగే అవకాశం ఉంది. వివాహితులు నిజాయితీగా ప్రవర్తించాలి. చిన్న విషయాన్ని దాచి పెట్టినా తర్వాత పెద్ద సమస్యగా మారవచ్చు.

55
ఆరోగ్య సూచనలు

ఈ వారం అలసట, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు, ఖర్చులు శక్తిని తగ్గిస్తాయి. నిద్రలేమి, తినే అలవాట్లలో గందరగోళం శరీరంపై వెంటనే ప్రభావం చూపిస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంటర్నెట్ వేదిక‌గా అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories