Mercury Transit: డిసెంబర్‌లో రెండుసార్లు మారనున్న బుధుడి మార్గం, ఈ రాశులకు డబ్బే డబ్బు

Published : Nov 16, 2025, 06:35 AM IST

Mercury Transit: గ్రహాల రాకుమారుడు బుధుడు.  డిసెంబర్‌లో బుధుడు తన రాశిని రెండు సార్లు మార్చనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. వీరు నక్కతోక తొక్కినట్టే.  

PREV
14
రెండు సార్లు బుధ సంచారం

ఈ ఏడాది డిసెంబర్లో బుధుడి వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా మంచి జరిగే అవకాశం ఉంది. వారి ఆదాయం, ఆస్తులు పెరుగుతాయి. బుధుడు డిసెంబర్లో రెండుసార్లు రాశిని మార్చుకుంటాడు.  మొదట డిసెంబర్ 6న వృశ్చిక రాశి లోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 29న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా రాశి మార్చుకోవడం వల్ల బుధుడు కొన్ని రాశుల వారికి ఎన్నో లాభాలను అందిస్తాడు.

24
మీన రాశి

మీన రాశి వారికి బుధ గ్రహం వల్ల  జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. వీరి కెరీర్‌ దూసుకెళ్లిపోతుంది. ఉద్యోగం, చదువులో పురోగతి కనిపిస్తుంది.  ఎప్పుడో ఆగిపోయిన పనులన్నీ ఈ డిసెంబర్లో పూర్తయిపోతాయి. మీ ఆలోచనలు, మాటతీరు ఎంతో మందికి నచ్చుతాయి. 

34
మేష రాశి

మేష రాశి వారికి డిసెంబర్లో అంతా కలిసివస్తుంది. వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. బుధుడు వీరికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తాడు. ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మంచి గుర్తింపు, విజయం దక్కుతుంది.

44
మకర రాశి

మకర రాశి వారికి డిసెంబర్ నెలలో లాభాలే లాభాలు. బుధుడి వల్ల వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. వీరు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి డిసెంబర్ ఎంతో అనుకూలమైన సమయం. ఈ రాశి వారు స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories