ధనుస్సు రాశికి అధిపతి గురుడే. కాబట్టి వారికి గురు సంచారం వీరికి ఎంతో లాభిస్తుంది. ఇది వారి జీవితంపై ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. 2026 సంవత్సరంలో ఉద్యోగాలు, ప్రయాణాలు, చదువు… ఇలా అన్నీ కలిసొస్తాయి. వీరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగం, విద్య లేదా విదేశీ ప్రయాణాలు వంటి అవకాశాలు కలిసివస్తాయి. ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయడం అవుతారు. వారితో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. వీరి జీవితంలోని అనుబంధాలు స్థిరంగా మారుతాయి. ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి. వీరికి 2026 అదృష్టాన్ని తెచ్చే సంవత్సరమనే చెప్పాలి.