జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. శని దేవుడు కర్మ, న్యాయం, క్రమశిక్షణలకు సూచికగా భావిస్తారు. ప్రస్తుతం శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. కానీ అక్టోబర్ 2025లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, అంటే జ్ఞానం, ఆధ్యాత్మికత, ధర్మానికి ప్రతీక. శని గ్రహం బృహస్పతి ఆధీనంలోని ఈ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు తెరవనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ మార్పు శుభఫలితాలు ఇస్తుంది.