Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టంతో పని లేదు..!

Published : Aug 27, 2025, 08:11 AM IST

పిసరంత అదృష్టం లేకపోయినా జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్లేవారు కూడా ఉంటారు. కేవలం తమ కష్టం మీద మాత్రమే వారు ఆధారపడతారు.

PREV
15
birth date

జీవితంలో మంచి స్థాయికి వెళ్లేందుకు చాలా కష్టపడేవారు చాలా మంది ఉంటారు. అయితే.. ఎంత కష్టపడినా సక్సెస్ కాలేని సమయంలో.. కష్టంతో పాటు..కూసంత అదృష్టం కూడా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. చాలా మంది తమకు లక్ లేకపోవడం వల్లనే మంచి స్థాయికి వెళ్లలేకపోయాం అని బాధపడేవారు కూడా ఉన్నారు. అయితే...పిసరంత అదృష్టం లేకపోయినా జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్లేవారు కూడా ఉంటారు. కేవలం తమ కష్టం మీద మాత్రమే వారు ఆధారపడతారు. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి వారు ఉన్నారు. మరీ ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం నాలుగు తేదీల్లో పుట్టిన వారు ఈ విషయంలో ముందున్నారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

25
నెంబర్ 4...

ఏ నెలలో అయినా 4 వ తేదీలో జన్మించినవారు సహజంగా క్రమశిక్షణతో ఉంటారు. వారి జీవితానికి బలమైన పునాది వేసుకుంటారు. వీళ్లు ఏ పని చేయడానికి అయినా మంచి ప్రణాళిక వేసుకుంటారు. ఒక ప్లానింగ్ ప్రకారమే అడుగులు వేస్తారు. జీవితంలో చాలా కష్టపడతారు. అందుకే.. ఇతరులతో పోలిస్తే.. వీరు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలపడగలుగుతారు. చాలా సులభంగా ఆ సమస్యలను అధిగమించగలరు. వీరికి విజయాలు అదృష్టం వల్ల కాదు.. కృషితో, పట్టుదలతో, వారి శ్రమ వల్ల మాత్రమే వస్తాయి.

35
నెంబర్ 8...

ఏ నెలలో అయినా నెంబర్ 8వ తేదీన పుట్టిన వారు కూడా జీవితంలో చాలా కష్టపడతారు. ఈ తేదీల్లో పుట్టిన వారు వారి వయసు పెరిగే కొద్దీ ఆర్థికంగా, సామాజికంగా ఎదగగలుగుతారు. వారికి ఓర్పు చాలా ఎక్కువ. తెలివితేటలు కూడా ఎక్కువే. జీవితంలో విజయం సాధించడానికి వీరు ఎంత కాలం అయినా ఎదురు చూడగలరు. అంతే ఓర్పుగా శ్రమిస్తారు. చివరకు విజయం సాధించగలరు. చూసేవాళ్లకు వీరికి అదృష్టం ఎక్కువ అనిపించొచ్చు. కానీ, వాస్తావానికి వారి విజయానికి వారి ఓర్పు, కృషి మాత్రమే కారణం.

45
17వ తేదీ...

ఏ నెలలో అయినా 17వ తేదీలో పుట్టిన వారు జీవితంలో మంచి స్థాయికి వెళ్లగలరు. న్యూమరాలజీ ప్రకారం వీరు నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు మంచి స్థాయికి వెళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తారు. నిజాయితీతో పని చేస్తారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. ఈ స్వభావం కారణంగానే వీరి ఆశయాలు నెరవేరతాయి. మంచి విజయం సాధించగలరు.

55
22వ తేదీ...

ఏ నెలలో అయినా 22వ తేదీలో జన్మించిన వారిని మాస్టర్ బిల్డర్ అని పిలవచ్చు. న్యూమరాలజీ ప్రకారం వీరు నెంబర్ 4 కిందకు వస్తారు. చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. జట్టుతో కలిసి పని చేస్తారు. పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతగానో శ్రమిస్తారు. వీరిని అందరూ అదృష్టవంతులు అని పిలుస్తారు.కానీ.. వీరి విజయంలో ఒక్క శాతం కూడా లక్ అనేది ఉండదు. కేవలం వీరి శ్రమ, పట్టుదల మాత్రమే ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories