నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని గొడవ జరుగుతుంది!

Published : Aug 27, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 27.08.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు.

413
మిథున రాశి ఫలాలు

ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు  పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రుల మాటలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. పిల్లల చదవుకు సంబంధించి శుభవార్తలు అందుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. ఉద్యోగాల్లో ఊహించని ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు పనిభారం నుంచి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవసరానికి చేతిలో తగినంత డబ్బు ఉండదు. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

1313
మీన రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories