Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడ‌లిగా వ‌స్తే.. ఆ ఇంటి అదృష్టం మారిన‌ట్లే

Published : Feb 26, 2026, 12:19 PM IST

Numerology: న్యూమ‌రాల‌జీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, అదృష్టం, కుటుంబ జీవితం గురించి అంచనాలు వేస్తారు. ముఖ్యంగా కొంతమంది మూలాంకాలకు చెందిన మహిళలు పెళ్లి తర్వాత అత్తింటికి అదృష్టాన్ని తీసుకొస్తారని నమ్మకం ఉంది. 

PREV
15
మూలాంకం అంటే ఏమిటి? ఎలా లెక్కించాలి?

న్యూమ‌రాల‌జీలో మూలాంకం జన్మ తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6 అవుతుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి మూలాంకం 3 అవుతుంది. ఇదే విధంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి మూలాంకం 2 అవుతుంది. మూలాంకం వ్యక్తి స్వభావం, ఆలోచన విధానం, అదృష్టం గురించి సూచనలు ఇస్తుందని నమ్మకం. కొంతమంది మూలాంకాలకు చెందిన మహిళలు పెళ్లి తర్వాత అత్తింటికి మంచి ఫలితాలు తీసుకొస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వారి రాకతో కుటుంబంలో శాంతి, సంతోషం, ఆర్థికాభివృద్ధి పెరుగుతుందని విశ్వసిస్తారు.

25
మూలాంకం 6 మహిళలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు

మూలాంకం 6 కు అధిపతి శుక్రగ్రహం అని భావిస్తారు. శుక్రగ్రహం సుఖసౌకర్యాలు, ప్రేమ, అందం సూచికగా చెబుతారు. అందుకే మూలాంకం 6 మహిళలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన మహిళలు పెళ్లి తర్వాత అత్తింటికి మంచి మార్పులు తీసుకొస్తారని నమ్మకం. వీరు ఇంటిని అందంగా ఉంచడంలో నిపుణులు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత సుఖసౌకర్యాలు పెరుగుతాయని చెబుతారు. అందుకే వీరిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి వీరు కారణమవుతారని విశ్వాసం.

35
మూలాంకం 3 మహిళలు సంపదను పెంచుతారని నమ్మకం

3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన మహిళలకు మూలాంకం 3 అవుతుంది. ఈ మూలాంకం మహిళలు పెళ్లి తర్వాత వెళ్లే ఇంట్లో సంపద, ఆహార ధాన్యాలు ఎప్పుడూ కొరత ఉండదని చెబుతారు. వీరు కుటుంబ సభ్యులతో సులభంగా కలిసిపోతారు. అత్తమామలకు దగ్గరగా ఉంటారు. కుటుంబంలో గౌరవం పొందుతారు. వీరు వెళ్లిన ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్మకం. కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అందుకే వీరిని అదృష్టవంతులుగా భావిస్తారు.

45
మూలాంకం 2 మహిళలు కుటుంబానికి అదృష్టం తీసుకొస్తారు

2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన మహిళలకు మూలాంకం 2 ఉంటుంది. ఈ మూలాంకం మహిళలు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. కుటుంబాన్ని కలిపి ఉంచే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు అత్తింటికి వచ్చిన తర్వాత కుటుంబ సమస్యలు తగ్గుతాయని చెబుతారు. కష్టకాలంలో కుటుంబానికి మద్ధతుగా నిలుస్తారు. వారి భర్తకు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి కలుగుతుందని నమ్మకం. కుటుంబంలో శాంతి వాతావరణం ఏర్పడటానికి వీరు కారణమవుతారని చెబుతారు.

55
ఈ నమ్మకాల్లో ఎంత నిజం ఉంది.?

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని మూలాంకాలు అదృష్టాన్ని సూచిస్తాయని చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 6, 3, 2 మహిళలు పెళ్లి తర్వాత కుటుంబానికి శుభఫలితాలు తీసుకొస్తారని విశ్వాసం ఉంది. అయితే ఇవి సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి కుటుంబ పరిస్థితి వేరుగా ఉంటుంది. కేవలం మూలాంకం ఆధారంగా మాత్రమే జీవితం నిర్ణయించబడద‌నే విష‌యాన్ని గుర్తించాలి. కుటుంబంలో సంతోషం, ఐక్యత, పరస్పర సహకారం ఉంటేనే నిజమైన అదృష్టం వస్తుందని చెప్ప‌డంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories