Jupiter Moon Conjuction: గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం, ఈ 5 రాశులదే అదృష్టమంతా

Published : Feb 26, 2026, 09:47 AM IST

Jupiter Moon Conjuction: ఫిబ్రవరి 26న అంటే ఈరోజు తెల్లవారుజామున 12:54 గంటలకు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే గురు గ్రహం మిథున రాశిలో ఉన్నాడు. దీంతో చంద్రుడు, గురుడి కలయిక జరిగి గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం 5 రాశులకు కలిసివస్తుంది.

PREV
15
వృషభ రాశి

గజకేసరి రాజయోగం ఎన్నో శుభాలను అందిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యోగం విపరీతంగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో  ఆకస్మికంగా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఈ రాశి వారి మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని పెట్టాలి. అవి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 

25
మిథున రాశి

మిథున రాశిలోనే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి వీరికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.   చంద్రుడు మిథున రాశిలోకే వస్తున్నాడు. ఇప్పుటికే గురు గ్రహం ఈ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ యోగం ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాజయోగం వల్ల ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు అవుతాయి. అవి లాభాలను తెచ్చిపెడతాయి.

35
కన్య రాశి

గజకేసరి యోగం కన్యారాశి వారి కెరీర్‌కు మంచి పురోగతి అందిస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగం చేసేచోట లేదా పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. వీరికి అధికారుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులు ఈ కాలంలో పూర్తయిపోయే అవకాశం ఉంది. పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి విజయం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

45
ధను రాశి

ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజ యోగం ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.  భాగస్వామ్యాలు, సంబంధాలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వీరి వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా సాగుతుంది. వ్యాపార భాగస్వాముల నుంచి సపోర్టు దక్కుతుంది.  కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది శుభకరమైన కాలమనే చెప్పాలి.  సమాజంలో ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది.

55
మీన రాశి

మీన రాశి వారికి గజకేసరి రాజయో యోగం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది.  ఇంట్లో సంతోషం, ఆస్తి విషయాల్లో లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇల్లు, వాహనం లేదా భూమికి సంబంధించిన శుభవార్తలు వింటారు.  మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories