4.పచ్చని ప్రకృతి లేదా అడవి..
పచ్చని ప్రకృతి దృశ్యాలు వృద్ధికి , కొత్త అవకాశాలకు సూచన. ఇలాంటి పెయింటింగ్, లేదా ఫోటోని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంచుతుంది. ఇలాంటి పెయింటింగ్ ని పిల్లల గదిలో ఉంచితే వారి ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి పెయింటింగ్ ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయి.
5.హంసల జంట..
బెడ్ రూమ్ లో అలంకరించుకోవడానికి ఇది అత్యంత ఉత్తమమైన చిత్రం. ఇలాంటి ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరగడానికి దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటి ఫోటో ఇంట్లో బెడ్రూమ్ లో నైరుతి దిశ గోడపై ఉంచాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం...
హింసాత్మక చిత్రాలు వద్దు: యుద్ధం, ఏడుస్తున్న మనుషులు, ముళ్ల మొక్కలు లేదా క్రూర మృగాల చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి.
విరిగిన ఫ్రేములు: పగిలిన గాజు లేదా విరిగిపోయిన ఫ్రేములు ఉన్న చిత్రపటాలను వెంటనే తొలగించాలి.
పరిశుభ్రత: గోడలపై ఉండే చిత్రాలపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి, లేదంటే అది అదృష్టాన్ని అడ్డుకుంటుంది.