జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు వారి భార్యను అమితంగా ప్రేమిస్తారట. వారిని సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తారట. ఇంతకీ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఇలా ఉంటారో తెలుసుకోండి.
ఏ నక్షత్రాల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు?
పెళ్లి సమయంలో జాతకాలు చూడటం సహజం. రాశులు, నక్షత్రాలు కలిస్తేనే చాలామంది పెళ్లికి రెడీ అవుతారు. అయితే కొన్ని నక్షత్రాలు పెళ్లికి అనుకూలంగా ఉండవచ్చు. మరి కొన్ని అనుకూలంగా లేకపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అబ్బాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి.. అతనికి వచ్చే భార్య అదృష్టాన్ని అంచనా వేయచ్చు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను విపరీతంగా ప్రేమిస్తారట. భార్య కోసం ఏమైనా చేస్తారట. మరి అమ్మాయిలకు అదృష్టాన్ని తెచ్చే ఆ నక్షత్రాలేంటో ఓసారి చూసేయండి.
24
ఉత్తర ఫల్గుణి నక్షత్రం:
ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకమైనవారు. నిబద్ధత కలిగినవారు. వీరు తమ భార్యను చాలా ప్రేమిస్తారు. వారిపట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వారిని సంతోషంగా ఉంచేందుకు.. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునేందుకు నిత్యం కష్టపడతారు.
34
అనురాధ నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా శ్రద్ధ కలిగినవారు. మొదటి నుంచి కూడా వీరు కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి తర్వాత వారి భార్య జీవితంలో అన్ని తానై ఉండాలని కోరుకుంటారు. భార్య అభిప్రాయలను గౌరవిస్తారు. ఆమెను సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు.
హస్త నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా తెలివైనవారు. ప్రతిభ కలిగిన వారు. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తనకు తగిన మహిళను ఎంచుకొని.. జీవితాంతం వారిని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటారు.
ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు విశ్వాసపాత్రులు. భార్య భర్తల బంధంలో చాలా నిజాయతీగా ఉంటారు. భార్యతో మనస్ఫూర్తిగా జీవిస్తారు. కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.
శ్రవణ నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా వినయంగా ఉంటారు. క్రమశిక్షణ కలిగినవారు. వీరు భార్య పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. వారిని విడిచి ఉండేందుకు ఇష్టపడరు. తాను కష్టపడినా కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటారు.