జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలో ఉన్న బుధుడు, గురువులతో కలిసి శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యోగం వల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.
జూన్ 15న సూర్యుడు వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు, గురువు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నారు. మిథున రాశిలోకి సూర్యుని ప్రవేశం సూర్య, బుధ, గురువుల త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్యంలో ఈ యోగాన్ని బ్రహ్మ ఆదిత్య యోగం అంటారు. ఈ యోగాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
24
మిథున రాశివారిపై త్రిగ్రహ యోగ ప్రభావం
మిథున రాశి వారికి సూర్య, గురు, బుధ గ్రహాల త్రిగ్రహ యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీని ప్రభావంతో వివిధ రంగాలవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ కెరీర్‌లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో సడెన్ గా ప్రమోషన్ రావచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వస్తాయి. ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కళాత్మక, సృజనాత్మక సామర్థ్యాల కారణంగా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది.
34
సింహ రాశి
సింహ రాశి వారు ఈ యోగం వల్ల తమ జీవితంలో మంచి ఫలితాలను చూడవచ్చు. గురువు మీ జ్ఞానాన్ని పెంచుతాడు. సూర్యుడు మీకు ఆలోచనా శక్తిని ఇస్తాడు. ఈ సమయంలో మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీ ప్రత్యర్థులకు సరైన సమాధానం చెప్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి వారికి త్రిగ్రహ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం వల్ల మీ జీవితంలో పురోగతి ఉంటుంది. ఈ యోగం మీకు అనేక విషయాల్లో విజయాన్ని అందిస్తుంది. ఈ రాశి వారి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. రచన, గానం లేదా సంగీత రంగాల్లో మీకు మంచి పేరు రావచ్చు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు మంచి వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది.