Vastu Tips: రెండు అంతస్తుల బిల్డింగ్ లో అన్న పైన ఉండాలా? కింద ఉండాలా?వాస్తు ఏం చెబుతోంది?

Published : Jan 23, 2026, 01:47 PM IST

రెండు అంతస్తుల ఇల్లు కట్టుకోవడం చాలామంది కల. కానీ ఆ కల నిజమయ్యే సమయంలో ఒక చిన్న ప్రశ్న పెద్ద చర్చగా మారుతుంది. “అన్న, తమ్ముడిలో ఎవరు పైన ఉండాలి? ఎవరు కింద ఉండాలి?” అని. ఇంట్లో సుఖశాంతులు నిలవాలంటే ఎవరు పైన ఉండాలి? వాస్తు ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.

PREV
16
Vastu for Two Floor House

రెండు అంతస్తుల బిల్డింగ్‌లో ఎవరు పైన ఉండాలి? ఎవరు కింద ఉండాలి? అనే విషయం చాలా కుటుంబాల్లో చర్చకు వస్తుంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఈ ప్రశ్న మరింత సున్నితంగా మారుతుంది. ఇది కేవలం సౌకర్యం విషయం మాత్రమే కాకుండా, కుటుంబ సంబంధాలు, మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు.. నివసించే వారి శక్తిని ప్రతిబింబించే స్థలం కాబట్టి, ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది ఆలోచించి నిర్ణయించుకోవాలి.

26
ఇంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తి..

వాస్తు ప్రకారం ఇంటి కింద అంతస్తు స్థిరత్వానికి, భద్రతకు సూచిక. కాబట్టి కుటుంబంలో పెద్దవారు లేదా ఎక్కువ బాధ్యతలు తీసుకునే వ్యక్తి కింద ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో అన్ననే కుటుంబానికి నాయకుడిగా ఉంటాడు కాబట్టి, అతను కింది అంతస్తులో ఉండటం కుటుంబ సమతుల్యతకు అనుకూలంగా ఉంటుంది. ఇది కుటుంబ వ్యవహారాలపై సహజంగా నియంత్రణ ఉండేలా చేస్తుంది.

36
కొత్తగా జీవితం ప్రారంభించే వ్యక్తి

వాస్తు ప్రకారం పై అంతస్తు ఎక్కువగా వ్యక్తిగత జీవితం, ప్రశాంతతకు సంబంధించింది. కాబట్టి చిన్నలేదా కొత్తగా కుటుంబ జీవితం ప్రారంభించే వ్యక్తి పైన ఉండటం మంచిది. అంటే తమ్ముడు పై అంతస్తులో ఉండవచ్చు. వాస్తు నిపుణుల ప్రకారం.. చిన్నవారి బరువు, బాధ్యతలు మోయగలిగే శక్తి పెద్దవారికి ఉంటుంది కానీ.. పెద్దవారిని భరించే శక్తి చిన్నవారికి ఉండకపోవచ్చు. 

46
కుటుంబ సభ్యుల భావాలు కూడా ముఖ్యం..

అయితే అన్ననే తప్పనిసరిగా కింద ఉండాలనే కఠినమైన నియమం వాస్తులో లేదు. అన్న పైన ఉండటం వల్ల కొన్నిసార్లు మానసికంగా అసౌకర్యం కలగవచ్చని మాత్రమే నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఇది మాటల మధ్య దూరం లేదా అపోహలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల భావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

56
కింద ఉండటమే ఉత్తమం

అంతేకాదు వయసు, ఆరోగ్యం కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వయసు ఎక్కువగా ఉండి మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటే, అతను కింద ఉండటమే ఉత్తమం. వాస్తు శాస్త్రం ఆరోగ్యానికి విరుద్ధమైన నిర్ణయాలను ఎప్పటికీ ప్రోత్సహించదు. శారీరక సౌకర్యం ఉన్నచోటే మనశ్శాంతి ఉంటుంది.

66
ఆర్థిక బాధ్యత

మరొక ముఖ్యమైన అంశం ఆర్థిక బాధ్యత. ఇంటి నిర్మాణానికి ఎక్కువగా ఖర్చు చేసిన వ్యక్తి, ప్రధాన అంతస్తులో ఉండటం వాస్తు పరంగా సరైంది. ఇది సంపద స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా రెండు అంతస్తుల ఇంట్లో అన్న కింద ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం అనుకూలం. కానీ ప్రతి కుటుంబం వేరుగా ఉంటుంది.  కాబట్టి వయస్సు, ఆరోగ్యం, ఆర్థిక బాధ్యతలు, పరస్పర అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. వాస్తు శాస్త్రం మార్గం చూపుతుంది కానీ కుటుంబ సుఖశాంతులు మాత్రం మన ఆలోచనలు, పరస్పర గౌరవంపైనే ఆధారపడి ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories