Saturn Mercury Conjuction: శని బుధ కలయికతో లాభ దృష్టి యోగం ఈ 4 రాశులకు డబ్బే డబ్బు

Published : Jan 23, 2026, 12:29 PM IST

Saturn Mercury Conjuction: ఈ ఏడాది ప్రారంభంలో శని, బుధ గ్రహాల దృష్టి వల్ల లాభ దృష్టి యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంది. ఏ రాశుల వారికి ఈ యోగం కలిసివస్తుందో తెలుసుకోండి. 

PREV
14
వృషభం

వృషభ రాశి వారికి ఈ యోగం ఎంతో కలిసి వస్తుంది. బుధుడు ఈ రాశి వారికి యోగ కారకుడు. కాబట్టి ఈ యోగం ఏర్పడే సమయంలో అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. ఇరుక్కుపోయిన బాకీలు వసూలవుతాయి. ఇతరుల చేతిలో చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. కొత్తగా పెట్టిన పెట్టుబడులు బాగా లాభాలు తెచ్చిపెడతాయి. ఆ పాత పెట్టుబడుల ద్వారా రెట్టింపు లాభాలు పొందుతారు.  తండ్రి  వైపు నుంచి వచ్చే ఆస్తి సమస్యలు తీరిపోతాయి.

24
మిథునం

మీ రాశి అధిపతి బుధుడు. దీని వల్ల ఈ యోగం ఈ రాశి వారికి ఎంతో కలిసి వస్తుంది.  శని అనుకూల దృష్టి మిథునరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది.  వీరు చేసిన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వీరు చేసే విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వీరికి వాక్చాతుర్యం ఎక్కువ. కుటుంబంలో ఉన్న కలహాలు తీరిపోయి అందరూ సంతోషంగా కలిసి ఉంటారు.

34
కన్యా రాశి

కన్యా రాశికి ఈ యోగం పూర్తిగా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి పూర్వ పుణ్య ఫలాలను అందిస్తుంది. మీ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు మళ్లీ జరుగుతాయి. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వీరు తమ పిల్లల వల్ల గర్వపడతారు. వ్యాపారం చేసే వారికి మంచి కొత్త భాగస్వాములు చేరతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. వీరి ఆస్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తల్లి వైపు నుంచి వారసత్వ ఆస్తులు బాగా కలిసివస్తాయి.

44
కుంభం

శని కుంభరాశిలోనే ఉండి బుధుడితో కలిసి లాభ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. కాబట్టి ఈ యోగం ఫలాలు కుంభరాశి వారికి  పూర్తిగా దక్కుతుంది. ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఎంతో ఉత్సాహంగా జీవిస్తారు.  ఈ రాశి వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వీరికి అవసరమైన సమయంలో డబ్బులు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories