Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే మంచిది? ఏ రోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది?

Published : Jan 23, 2026, 01:42 PM IST

Money Plant: మనీప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచిది. కానీ ఏ రోజు నాటాలో, ఏ దిశలో నాటాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు కూడా ఇంట్లో మనీప్లాంట్ పెంచాలనుకుంటే వాస్తుపరంగా కొన్ని విషయాలు తెలుసుకోండి. 

PREV
14
మనీ ప్లాంట్ నాటేందుకు మంచి రోజులు ఇవే

ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం శుభప్రదం అని అందరికీ తెలుసు. అయితే వాస్తు శాస్త్రం, సంప్రదాయ నమ్మకాల ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో నాటేందుకు ఒక మంచి రోజు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అందుకే మొక్కను ఎప్పుడు నాటాలో, ఏ రోజు నాటితో మంచిదో అవగాహన పెంచుకోవాలి. సాధారణంగా మనీ ప్లాంట్ నాటేందుకు గురువారం అత్యంత శుభమైన రోజుగా చెబుతారు. గురువారం సంపద, జ్ఞానం, అభివృద్ధికి కారకుడైన గురు గ్రహానికి సంబంధించిన రోజు. ఆరోజు నాటితే ధనం, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శుక్రవారం కూడా మనీ ప్లాంట్ నాటేందుకు మంచిదిగానే చెబుతారు. శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించిన రోజు. శుక్ర గ్రహం బలంగా ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఇంట్లో పెరుగుతాయి.

24
ఈ రోజుల్లో మంచిది కాదు

మనీ ప్లాంట్ నాటేందుకు మంచి రోజులు ఉన్నట్టే.. మనీ ప్లాంట్ నాటకూడని రోజులు కూడా ఉన్నాయి. అవే మంగళవారం, శనివారం. ఈ రెండు వారాల్లో మనీ ప్లాంట్ నాటకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం అగ్ని తత్వానికి చెందినది. ఇక శనివారం శని గ్రహానికి సంబంధించినది. ఆ రోజున మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆశించిన ఫలితాలు రావని అంటారు. అలాగే అమావాస్య, గ్రహణం సమయంలో కూడా మొక్కలు నాటకపోవడమే మంచిది. శాస్త్రీయంగా చూసుకుంటే మనీ ప్లాంట్ ఎక్కువగా పెరిగే కాలం వర్షాకాలం. ఈ కాలంలో మొక్క నాటితే త్వరగా వేళ్ళు పెంచుకొని మొక్క బాగా ఎదుగుతుంది.

34
ఏ దిశలో నాటాలి?

మనీ ప్లాంట్ నాటేందుకు మంచి రోజు మాత్రమే చూస్తే సరిపోదు. ఏ దిశలో నాటాలో కూడా తెలుసుకోవాలి. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేందుకు తూర్పు లేదా ఉత్తర దిశలు మంచివని అంటారు. ముఖ్యంగా ఉత్తర దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించినది. ఈ దిశలో మనీ ప్లాంట్ పెంచితే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని అంటారు. పడమర, దక్షిణ దిశల్లో మాత్రం మనీ ప్లాంట్ మొక్కను ఉంచకపోవడమే ఉత్తమం. ఈ మొక్క ఎండకు నేరుగా కాకుండా మోస్తరు వెలుతురు తగిలేలా ఉంటే చాలు. ఎక్కువ నీరు పోయకుండా, మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. ఎండిపోయిన ఆకులు, పసుపు రంగులో మారిన ఆకులను వెంటనే తీసేయాలి. లేకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.

44
ఆరోగ్యం కోసం పెంచండి

మనీ ప్లాంట్ ను కేవలం వాస్తు శాస్త్రం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఇంట్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొక్క గాలిలోని హానికరమైన వాయువులను చాలా వరకు తొలగిస్తుంది. ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో మనీ ప్లాంట్ ఉండడం మంచిదని చెబుతారు నిపుణులు. గురువారం, శుక్రవారం వంటి శుభదినాల్లో.. అది కూడా ఉదయం సమయంలో మనీ ప్లాంట్ నాటితే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నాటేటప్పుడు మనసులో మంచి ఆలోచనలు తలచుకోవాలి. శుభసంకల్పంతో నాటాలి. ఇలా సరైన రోజు, సరైన దిశ, సరైన పద్ధతిలో మనీ ప్లాంట్ నాటితే మీ ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories