ధనుస్సు రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుంచి డబ్బు ఒత్తిడి పెరుగుతుంది.