
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దాంట్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ తో వారు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ, కొందరు ఉంటారు.. వారికి రానిది అంటూ ఏదీ ఉండదు. ఆటలు, పాటలు, డ్యాన్స్, చదువు ఇలా అన్నింట్లో ముందుంటారు. వీళ్లనే మనం మల్టీ టాలెంటెడ్ అని పిలుస్తూ ఉంటాం. ఇలాంటి టాలెంట్ పుట్టిన తేదీతో వస్తుందంటే మీరు నమ్ముతారా? మీరు చదివింది నిజమే, న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించినవారిలో పుట్టుకతోనే ఇలాంటి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
ఏ నెలలో అయినా 5వ తేదీలో జన్మించిన వారు సహజంగానే చాలా చురుకుగా ఉంటారు. ఏదైనా విషయాన్ని, పనిని చాలా ఆసక్తిగా నేర్చుకోవాలని అనుకుంటారు. వీరి మనసు ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది.వీరు తమ జీవిత ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలపడతారు. అనుభవం నుంచి కొత్త పాఠం నేర్చుకుంటారు. జీవితాన్ని ఆనందంగా సాగించాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు సహజంగా చాలా చురుకుగా ఉంటారు. ఎక్కువ మందితో స్నేహం చేస్తారు. ఎవరితోనైనా సులభంగా కలిసిపోగలరు. కొత్త టెక్నాలజీ, భిన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. వీరికి తెలియనిది అంటూ ఏదీ ఉండదు. ఉద్యోగం చేయడానికి ఒక రంగం ఎంచుకున్నా.. మిగిలిన చాలా రంగాల్లో వీరికి అవగాహన ఉంటుంది. సమయం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు.
ఏ నెలలో అయినా నెంబర్ 14వ తేదీలో పుట్టిన వారు కూడా చాలా మల్టీ టాలెంటెడ్. వీరికి రానిది, తెలియనిది ఏదీ ఉండదు. ఏదైనా తమకు తెలియకపోయినా.. దాని గురించి తెలుసుకునేదాక, నేర్చుకునేదాక వదిలిపెట్టరు. అంతేకాదు, వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినా.. దానిని విశ్లేషించి, పరిష్కార మార్గాలను కనుగొనడంలో ముందుంటారు. వీరు అప్పటికప్పుడు వచ్చే ఫలితాలు గురించి కాకుండా... ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడైనా పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో లాభాలు వచ్చేలా చూసుకుంటారు. నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లగలడంలో ముందుంటారు. జ్ఞానాన్ని విస్తరించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. తమ పరిధిని విస్తరించడంలో, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వ్యాపార, ఆర్థిక రంగాల్లో వీరికి మంచి ప్రతిభ ఉంటుంది.
ఏ నెలలో అయినా 21 తేదీల్లో జన్మించిన వారు చాలా డైనమిక్ గా ఉంటారు. వీరికి మేధాశక్తి చాలా ఎక్కువ. చాలా తెలివిగా ఆలోచిస్తారు. సృజనాత్మకత కూడా ఎక్కువ. వాళ్లు కొత్త అవకాశాలను అన్వేషించడంలో, కొత్తదనాన్ని స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటారు. వీరికి సంభాషణల్లో చాతుర్యం, ప్రదర్శనలో నైపుణ్యం, నేతృత్వంలో స్పష్టత ఉండడం వల్ల కళలు, వ్యాపారం, కమ్యూనికేషన్ రంగాల్లో రాణించగలుగుతారు. విభిన్న అనుభవాలతో జీవితాన్ని బలంగా నిర్మించుకునే శక్తి వీరికి ఉంటుంది.
ఏ నెలలో అయినా 23వ తేదీలో జన్మించిన వారు సామాజికంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో కూడా అత్యంత నైపుణ్యంతో ఉంటారు. వీరు తమ అభిరుచి, ఉత్సాహంతో తెలియని ఏ విషయాన్ని అయినా తెలుసుకోగలుగుతారు. వీరి చురుకైన మెదడు వారికి కొత్త అవకాశాలను తెలుసుకునేలా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి వీరిలో ఉంటుంది. వీరు చాలా బాగా మాట్లాడగలరు. కమ్యూనికేషన్ తో అందరినీ ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, మ్యూజిక్, టెక్నాలజీ వంటి రంగాల్లో వీరు దూసుకుపోతారు.
ఫైనల్ గా...
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. కానీ, కొందరికి సహజంగానే ఉండే స్పష్టమైన బుద్ధి, తెలివితేటలు, అనేక రంగాల్లో నైపుణ్యాలను పొందగల సామర్థ్యం వారికి జీవితం పట్ల ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తుంది. మీరు కూడా ఈ తేదీలలో జన్మించి ఉంటే, మీ సామర్థ్యాన్ని నమ్మండి.