Vastu Tips: ఇంట్లో అద్దాన్ని ఈ ప్లేస్ లో పెడితే.. డబ్బులకు లోటే ఉండదు!

Published : Jun 26, 2025, 06:37 PM IST

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాన్ని ఎక్కడ పెట్టాలనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా పాటిస్తేనే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, అభివృద్ధి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అద్దాన్ని ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదో ఇక్కడ చూద్దాం.  

PREV
17
అద్దం ఎక్కడ పెడితే మంచిది?

తూర్పు, ఉత్తర దిశలు: వాస్తు ప్రకారం అద్దాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం మంచిది. ఈ దిశల్లో పెట్టిన అద్దాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతాయి. తూర్పు దిశ సూర్యోదయ దిశ కాబట్టి.. అద్దం పెట్టడానికి అనువైంది. ఉత్తర దిశ కుబేరుడి దిశ కాబట్టి ఇక్కడ అద్దం పెట్టడం వల్ల డబ్బు వస్తుంది.  

27
బెడ్ రూమ్ లో అద్దం...

బెడ్ రూమ్ లో అద్దం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పడుకునే మంచం కనిపించేలా అద్దాన్ని ఉంచకూడదు. ఇది నిద్రను, మనశ్శాంతిని చెడగొడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మంచం కనిపిస్తే.. వాళ్ల మధ్య గొడవలు, అపార్థాలు వస్తాయి. 

బెడ్ రూమ్ లో అద్దం ఉంటే పడుకునే ముందు దాన్ని వస్త్రంతో కప్పి ఉంచాలి. లేదా అద్దాన్ని మంచానికి ఎదురుగా కాకుండా వేరే దిశలో పెట్టాలి. బెడ్ రూమ్ లో ఈశాన్యంలో అద్దం పెట్టకూడదు. ఇది సానుకూల శక్తిని తగ్గిస్తుంది. 

37
ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే?

ప్రధాన ద్వారం బయట అద్దం పెట్టకూడదు. ఇది ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తిని వెనక్కి పంపుతుంది. ద్వారం లోపల ఒక పక్కన అద్దం పెట్టచ్చు. ఉదాహరణకు, ద్వారం లోపల కుడి లేదా ఎడమ వైపు గోడపై అద్దం పెట్టడం మంచిది. ఇది ఇంట్లో ప్రశాంతత, ఆనందాన్ని పెంచుతుంది.

భోజనాల గదిలో: 

భోజనాల గదిలో అద్దాలు పెట్టడం చాలా మంచిది. ఇది ఇంట్లో ధనాన్ని రెట్టింపు చేస్తుంది. డైనింగ్ టేబుల్ కనిపించేలా అద్దం ఉంటే, ఇంట్లో ఆహార కొరత ఉండదు. భోజనంలో కూర్చునే చోట నుంచి అద్దం కనిపిస్తే.. ఆ గది అందం, సానుకూల శక్తి పెరుగుతాయి. పెద్ద అద్దాలు భోజనాల గదిని విశాలంగా చూపిస్తాయి.

47
బాత్రూంలో అద్దం ఎక్కడ పెట్టాలంటే?

బాత్రూంలో అద్దాన్ని ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. వీలైతే బాత్రూమ్.. పశ్చిమ లేదా దక్షిణ గోడలపై అద్దాలను ఉంచవచ్చు. అవి కూడా చిన్నవే.

చదువుకునే గదిలో అద్దాలు పెడితే? 

చదువుకునే గదిలో అద్దాలు పెట్టడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి చదువుకునే టేబుల్ కు ఎదురుగా అద్దాలు ఉండకూడదు. అవసరమైతే గదిలో వేరే గోడపై ఉంచవచ్చు. వీలైనంత వరకు చదువుకునే గదిలో అద్దాలు పెట్టకపోవడమే మంచిది.

57
పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే?

విరిగిన లేదా పగుళ్లు వచ్చిన లేదా మసకబారిన అద్దాలను ఇంట్లో ఉంచుకోకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. ఇంటి శ్రేయస్సును దెబ్బతీస్తుంది. అలాంటి అద్దాలను వెంటనే తీసేయాలి. అద్దాలు ఎప్పుడూ శుభ్రంగా, మెరుస్తూ ఉండాలి. దుమ్ము లేదా మురికి పట్టినవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.

అద్దాల పరిమాణం, ఆకారం:

పెద్ద అద్దాలు ఎక్కువ సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. వృత్తాకార లేదా దీర్ఘవృత్తాకార అద్దాల కంటే చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకార అద్దాలు వాస్తు ప్రకారం మంచివి. పదునైన అంచులు గల అద్దాలను నివారించడం మంచిది. అద్దాలను నేల నుంచి నిర్దిష్ట ఎత్తులో ఉంచాలి. సాధారణంగా అద్దాలు మీ తలను పూర్తిగా ప్రతిబింబించే ఎత్తులో ఉండాలి.  

67
అద్దంలో ఏం కనిపించాలంటే?

అద్దంలో కనిపించే దృశ్యాలు అందంగా, సానుకూలంగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. ఒక పూల తోట లేదా ఒక అందమైన చిత్రం ప్రతిబింబించేలా అద్దం ఉంటే చాలా మంచిది. దానివల్ల ఇంట్లో ఉత్సాహం, సానుకూల శక్తి పెరుగుతుంది. 

77
ధన ప్రాప్తి కలగాలంటే?

ఉత్తర దిశ ధన దేవుడైన కుబేరుడికి ప్రీతికరమైన దిశ కాబట్టి.. ఈ దిశలో అద్దాలు పెట్టడం వల్ల ధన ప్రాప్తి పెరుగుతుంది. డబ్బు పెట్టె ఉన్న గది దగ్గర లేదా డబ్బు పెట్టె కనిపించేలా అద్దం పెడితే ధనం రెట్టింపవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories