Silver: బంగారం కాదు, వెండి చైన్ ధరిస్తే ఏమౌతుంది?

Published : May 24, 2025, 03:30 PM IST

పంచలోహాలలో ఒకటైన వెండి, చంద్రుడికి సంబంధించినది గా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా,మనసును ప్రశాంతంగా కూడా ఉంటుంది.

PREV
18
వెండి ఎందుకు ధరించాలి?

హిందూ సంప్రదాయంలో ప్రతి లోహానికి ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ బంగారం ధరించాలనే కోరిక ఉంటుంది. కానీ, బంగారమే కాదు.. వెండి కూడా మనకు అందాన్ని ఇస్తుంది.ప్రస్తుతం మార్కెట్లో కూడా వెండి లో మంచి మంచి డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి, అలాంటి వెండి ని ప్రతిరోజూ ధరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

28
వెండితో ప్రయోజనాలు

పంచలోహాలలో ఒకటైన వెండి, చంద్రుడికి సంబంధించినది గా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా,మనసును ప్రశాంతంగా కూడా ఉంటుంది. వెండి చైన్లు అంటే బోరింగ్ కాకుండా.. లేటెస్ట్ మోడల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. స్టైల్ కి స్టైల్ గా ఉంటూ.. మనకు ఎన్నో ప్రయోజనాలను ఈ వెండి అందిస్తుంది. శారీరక, మానసిక ప్రయోజనాలతో పాటు గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగించే శక్తి ఈ వెండికి ఉంది.

38
1. మానసిక ప్రశాంతత..

వెండి లోహం చంద్రుడిని సూచిస్తుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు వెండి ధరిస్తే, ఆయన ప్రభావం బలపడుతుంది. ఇది ఉద్వేగాలను నియంత్రించడంలో, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

48
2. సంబంధాలను మెరుగుపరిచే శక్తి

వెండి ధరించడం వల్ల కుటుంబ సభ్యులతో, మిత్రులతో సంబంధాల్లో సౌఖ్యం పెరుగుతుంది. కలహాలు తగ్గుతాయి, అనుబంధం బలపడుతుంది. ముఖ్యంగా వివాహ బంధం లో ఉన్నవారికి ఇది మరింత లాభాన్ని ఇస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

58
3. కుజ దోష నివారణ

జాతకంలో కుజుడు (అంగారకుడు) బలహీనంగా ఉన్నప్పుడు, ఆయన్ని బలపర్చే ఉపాయాలలో వెండి ధరించడం కూడా ఒకటి. ఇది మంగళదోషానికి సంబంధించిన ప్రతికూలతలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తుంది.కుజ దోషం ఉంటే పెళ్లి కాదు అంటారు..అలాంటివారు ఈ వెండి ధరించడం వల్ల దోషం తగ్గి, వివాహం జరిగే అవకాశం కూడా ఉంది.

68
4. ప్రమాద నివారణ

ప్రాచీన నమ్మకాల ప్రకారం, వెండి నెగటివ్ ఎనర్జీని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు, దురదృష్టకర సంఘటనల నుంచి వ్యక్తిని రక్షించగలదని నమ్మకం ఉంది. అందుకే పిల్లలు, వృద్ధులు, ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు దీనిని ధరించమని సూచిస్తూ ఉంటారు.

78
5. శరీరానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

వెండి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. వేసవిలో చెమట ఎక్కువగా వచ్చే వారికి ఇది చర్మాన్ని కూల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, మానసిక ఒత్తిడి తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

88
ఫైనల్ గా...

వెండి గొలుసు ధరించడం కేవలం అలంకారం కాదు, అది ఆరోగ్యం, శాంతి, జ్యోతిష దోష నివారణ వంటి ఎన్నో ప్రయోజనాలను కలిగించే పవిత్ర చర్య. మీరు కూడా మీ జాతకానుసారం జ్యోతిష్కుడి సలహాతో వెండి ధరించి, మంచి ఫలితాలు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories