Today Rasi Phalalu: ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Published : May 24, 2025, 05:00 AM IST

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 24.05.2025 శనివారానికి సంబంధించినవి.

PREV
112
మేష రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

212
వృషభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.

312
మిథున రాశి ఫలాలు

బంధువులతో అకారణంగా వివాదాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కలచి వేస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.

412
కర్కాటక రాశి ఫలాలు

రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో సంతషంగా గడుపుతారు.

512
సింహ రాశి ఫలాలు

మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహన యోగం ఉంది. బంధు మిత్రుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.

612
కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు వస్తాయి.  

712
తుల రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనుల్లో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు

మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. కొన్ని పనులను శ్రమతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

1012
మకర రాశి ఫలాలు

ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

1112
కుంభ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.

1212
మీన రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories