కిస్సా కుర్సీ కా: జగన్ కల నిజమయ్యేనా

First Published Mar 12, 2019, 1:36 PM IST

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జగన్‌ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జగన్‌ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశతో ఉన్నారు.2014 ఎన్నికల సమయంలోనే జగన్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దఫా చావో రేవో తేల్చుకోవాలని వైసీపీ భావిస్తోంది.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రానిక ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ రెండో తేదిన నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అనేకమంది మరణించారు. వారందరిని ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఓదార్పుయాత్రను ప్రారంభించారు.ఈ యాత్రకు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. జగన్ మాత్రం యాత్రను కొనసాగించారు.
undefined
దీంతో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తన పట్టును నిలుపుకొనేందుకుగాను 2011 మార్చి 12వ తేదీన వైసీపీని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.తెలంగాణలో కూడ టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడ ఆ పార్టీ రాజీనామాలను చేయించింది.
undefined
ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైసీపీలు విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.
undefined
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వైసీపీ వ్యతిరేకించింది. రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని ఆ పార్టీ కోరుకొంది.ఈ మేరకు ఉద్యమాలను చేసింది. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
undefined
టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ మద్దతు, బీజేపీతో పొత్తుతో పాటు అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
undefined
గత ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీకి మధ్య ఒక్క శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా సుమారు ఐదు లక్షలు. గత ఎన్నికల సమయంలో జగన్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు పార్టీకి నష్టం చేశాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
దీంతో గత ఎన్నికల సమయంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా ఆ పార్టీ నాయకత్వం ఈ దఫా జాగ్రత్తలు తీసుకొంటుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను నిర్వహించారు. 341 రోజుల పాటు 13 జిల్లాల్లో3648 కి.మీ పాటు పాదయాత్రను జగన్ కొనసాగించారు.
undefined
నవరత్నాల పేరుతో పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్ కొన్ని హామీలను ఇచ్చారు. ఈ నవరత్నాలతో పాటు పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన కొన్ని సూచనలు, సలహాలను కూడ పరిగణనలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆ పార్టీ భావిస్తోంది.
undefined
2019 ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తోంది. ఈ దఫా వైసీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
ఇప్పటికే టీడీపీలో టిక్కెట్లు దక్కని వారు, ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపుకు వైసీపీ తిప్పుకొంటుంది. ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
undefined
ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీలకే తాను మద్దతిస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. ఈ దఫా ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ దఫా జగన్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది మే 23న తేలనుంది.
undefined
click me!