ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

First Published | Dec 27, 2023, 3:03 PM IST


బీ.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య జరిగిన  16 ఏళ్లు పూర్తైంది. కానీ, ఆమెను హత్య చేసిన నిందితులను దర్యాప్తు అధికారులు గుర్తించలేదు.

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఆయేషా మీరా హత్య జరిగి నేటికి 16 ఏళ్లు పూర్తైంది. కానీ, ఇంతవరకు ఈ కేసులో దోషిని గుర్తించలేదు. గతంలో ఈ కేసులో నిందితుడిగా అనుమానించి  అరెస్టు చేసిన సత్యంబాబును హైకోర్టు నిర్ధోషిగా  విడుదల చేసింది. దీంతో  ఆయేషా మీరాను హత్య చేసింది ఎవరనే విషయమై ప్రశ్న తలెత్తుతుంది.

also read:రాజకీయాల నుండి తప్పుకుంటున్నా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఈ కేసు విచారణను  సీబీఐకి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయేషా పేరేంట్స్ శంషద్ బేగం,  ఇక్బాల్  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయేషా మీరాను హత్య చేసిన నిందితుల కోసం కోర్టులు, పోలీస్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  అంతేకాదు రాజకీయ పార్టీలు కూడ ఆయేషా మీరా హత్య కేసు అంశాన్ని  ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సందర్భాలు కూడ లేకపోలేదు.

also read:శిల్పాల వైభవం: అయోధ్య రామ మందిరం ఇంటీరియర్ ఫస్ట్ లుక్


ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

2007 డిసెంబర్  27న ఆయేషా మీరా హత్యకు గురైంది.  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్  హాస్టల్ లో  బీ ఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  బాత్రూమ్ వద్ద రక్తపు మడుగులో ఆయేషా మీరా అచేతన స్థితిలో  పడి ఉంది.  ఈ విషయాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు హాస్టల్  సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  ఆయేషా మీరా మృతిపై  కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఆయేషా మీరా  ఇబ్రహీంపట్టణంలోని  ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ బీ. ఫార్మసీ చదువుతుంది.  2018లో  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు  ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేయాలని  తీర్పును ఇచ్చింది.

also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

2007 డిసెంబర్  27న ఆయేషా మీరా హత్యకు గురైంది.  ఈ ఘటన జరిగిన  9 మాసాల తర్వాత సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో  సత్యంబాబును పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పోలీసులు  సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా  సత్యంబాబును  దోషిగా తేల్చుతూ 2010 సెప్టెంబర్ మాసంలో  విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పును వెల్లడించింది.  ఈ కేసులో జీవిత ఖైదును విధించింది.

also read:ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఈ తీర్పుపై  సత్యంబాబు  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో  2010 అక్టోబర్ లో అప్పీలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్నది హైకోర్టు.2017 మార్చి 31న తీర్పును వెల్లడించింది ఏపీ హైకోర్టు.  ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్ధోషిగా తేల్చింది ఏపీ హైకోర్టు. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

దరిమిలా ఆయేషా మీరాను ఎవరు హత్య చేశారనే విషయమై  మళ్లీ చర్చ ప్రారంభమైంది.ఆయేషా మీరా హత్య కేసును విచారణ చేయాలని కోరుతూ  ఆయేషామీరా పేరేంట్స్  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

దీంతో  ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కోర్టులోని సాక్ష్యాలు కూడ ధ్వంసమైన విషయాన్ని  సీబీఐ గుర్తించింది.ఈ విషయమై  కేసులు కూడ నమోదు చేశారు.

also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో అప్పట్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ దివంగత మాజీ మంత్రి మనమడిపై  ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను  మాజీ మంత్రి కుటుంబం తోసిపుచ్చింది. రాజకీయ కక్షతోనే ఈ ఆరోపనలు చేశారని  ఆ కుటుంబం ఈ వ్యాఖ్యలను ఖండించింది.

also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

2019 జనవరి 18న  సీబీఐ అధికారులు మాజీ మంత్రి మనమడిని కూడ విచారించారు. ఈ కేసులో  దోషిగా  అరెస్టు చేసి హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో విడుదలైన సత్యంబాబును కూడ సీబీఐ అధికారులు విచారించారు. 

also read:చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో భగ్గుమన్న విభేదాలు: పరస్పర దాడులు

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఆయేషా మీరా మృతదేహం పూడ్చిన ప్రాంతంలో  ఎముకలు, పుర్రెను వెలికి తీసి పరీక్షలకు పంపారు. 2019 డిసెంబర్ 15న ఫోరెన్సిక్ నివేదికకు వీటిని పంపారు.  ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆయేషా మీరా తల ఎముకలో గాయాలున్నట్టుగా  ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..

ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

ఆయేషా మీరా హత్య జరిగి 16 ఏళ్లు దాటుతున్నా ఇంతవరకు  అసలు దోషిని  మాత్రం గుర్తించలేదు.  ఆయేషా మీరాను ఎవరు హత్య చేశారనే విషయాన్ని ఇంకా దర్యాప్తు సంస్థలు గుర్తించలేదు. 

also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

Latest Videos

click me!