ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

First Published Dec 26, 2023, 3:18 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై  ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.  వచ్చే ఎన్నికల్లో  ఏ పార్టీ ఎవరితో కలిసి పోటీ చేయనున్నాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  2024 ఏప్రిల్ లో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.అయితే ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ నేతృత్వంలో  మరో కూటమి  ఏర్పాటయ్యే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.

also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి వై.ఎస్. షర్మిలను  కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావడం కోసం  ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తును ప్రారంభించింది.2024 జనవరి మాసంలో వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ నెల  27న  న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కే.సీ. వేణుగోపాల్ లు కాంగ్రెస్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ నేతలతో సమావేశం కానున్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?


2024 పార్లమెంట్ ఎన్నికల్లో  జాతీయ స్థాయిలో  సీపీఐ,సీపీఐ(ఎం)లు  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని  ఇండియా కూటమిలో ఉన్నాయి.  అయితే  2024లో జరిగే  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తాయా లేదా ఇతర పార్టీలతో కలిసి పోటీకి దిగుతాయా అనేది  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

తెలుగుదేశం పార్టీతో  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)  కలిసి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. గత కొంత కాలంగా తెలుగుదేశంతో కలిసి సీపీఐ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.   అయితే  కమ్యూనిస్టు పార్టీ ఇండియా (మార్క్సిస్ట్) మాత్రం  ఇప్పటికే  రాష్ట్రంలో ఒంటరిగానే  ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై  సీపీఐ(ఎం) ఒంటరిగానే పోరు నిర్వహిస్తుంది. 

also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?


 జాతీయ విధానంలో భాగంగానే  ఇండియా కూటమిలో  సీపీఐ, సీపీఐ(ఎం)లు  భాగస్వామిగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరు కూటమిల్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 

also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో  తెలుగుదేశం, జనసేనలు  ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి.ఈ రెండు పార్టీల మధ్య  పొత్తు కుదిరింది.  ఈ కూటమిలో సీపీఐ కూడ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది.  తమ పార్టీల ఉనికిని చాటుకొనే విధంగానే పొత్తులుంటాయని  సీపీఐ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి.  

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

కాంగ్రెస్ పార్టీ  కొత్త కూటమిని ఏర్పాటు చేస్తే ఈ కూటమిలో సీపీఐ(ఎం) చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  కాంగ్రెస్ తో సీపీఐ(ఎం) జత కడుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. కాంగ్రెస్ తో జత కట్టకుండా  ఒంటరిగా  ఆ పార్టీ పోటీ చేస్తుందా అనే విషయాన్ని ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వం  త్వరలోనే ప్రకటించే అవకాశం లేకపోలేదు. 

also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

కాంగ్రెస్ నేతృత్వంలో  మరో కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదికి వస్తే  రాజకీయంగా ఏ కూటమికి లాభం జరుగుతుందోననే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే  టీడీపీతో జనసేన జట్టు కట్టినట్టుగా ప్రకటించింది

also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి వస్తే  పరోక్షంగా  వైఎస్ఆర్‌సీపీ ప్రయోజనమనే భావన తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతుంది. అయితే  ఈ కూటమిలో ఏఏ పార్టీలుంటాయి, ఈ పార్టీలు ఏ మేరకు  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతాయనే  అనే అంశంపై  చర్చ ప్రారంభమైంది.  

also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఐ(ఎం)లతో  కాంగ్రెస్ పొత్తు చర్చలు చేసింది. సీపీఐకి ఒక్క సీటును కాంగ్రెస్ కేటాయించింది.  సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలపై అసంతృప్తితో సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేసింది.  కాంగ్రెస్ పొత్తుతో  సీపీఐ  అసెంబ్లీలో  అడుగుపెట్టింది.  సీపీఐ(ఎం) మాత్రం  అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయింది. 

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే  సీపీఐ, సీపీఐ(ఎం)లు వేర్వేరుగా పోటీ చేస్తాయా, ఒకే కూటమిలో  ఉంటాయా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూటమిగా బరిలోకి దిగుతుందా, ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయాలపై ఈ నెల  27న న్యూఢిల్లీలో జరిగే సమావేశంలో స్పష్టత రానుంది.

also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

click me!