కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

First Published Dec 28, 2023, 12:48 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతుంది.  2024 జనవరి మాసంలో   కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల  చేరే అవకాశం ఉందని  ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు  వై.ఎస్. షర్మిలను అధ్యక్షురాలిగా  చేస్తారనే  ప్రచారం కూడ లేకపోలేదు. 

also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్యమంత్రిగా వై.ఎస్. షర్మిల సోదరుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత  2011 మార్చి  12 న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)ని  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.

also read:శిల్పాల వైభవం: అయోధ్య రామ మందిరం ఇంటీరియర్ ఫస్ట్ లుక్

Latest Videos


కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

ఆనాడు  కాంగ్రెస్ పార్టీతో విభేదించి  వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేశారు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికే పరిమితమైంది.  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఆస్తుల కేసులో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  జైలులో ఉన్న సమయంలో  జగన్ సోదరి వై.ఎస్. షర్మిల  పాదయాత్ర నిర్వహించారు. 

also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

2019లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత  వై.ఎస్. షర్మిల,  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మధ్య అంతరం పెరిగినట్టుగా  ప్రచారం సాగుతుంది.  గతంలో ఇడుపులపాయకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిలలు ఒకేసారి వెళ్లేవారు. కానీ ఇటీవల కాలంలో  వేర్వేరుగా ఇడుపులపాయకు వెళ్తున్నారు. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

తెలంగాణలో  వై.ఎస్. షర్మిల  యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీని  ఏర్పాటు చేశారు.  అయితే ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని  వై.ఎస్. షర్మిల భావించారు. అయితే  ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఈ ప్రక్రియ  చివరి నిమిషంలో ఆగిపోయింది.  అయితే  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  వై.ఎస్. షర్మిల సేవలను  ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

ఈ తరుణంలోనే  వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ పార్టీ  నేతలు చర్చలు జరుపుతున్నారనే  ప్రచారం కూడ లేకపోలేదు. ఈ నెల  27న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలతో  మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ  ఈ విషయమై చర్చించారు. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు


వైఎస్ఆర్‌సీపీకి గౌరవ అధ్యక్షురాలిగా వై.ఎస్. విజయమ్మ గతంలో ఉన్నారు. అయితే  తెలంగాణ రాజకీయాల్లో  తన కూతురు వై.ఎస్. షర్మిల కొనసాగాలని నిర్ణయం తీసుకున్నందున  తన కూతురికి అండగా నిలవాలనే నిర్ణయంతో  2022 జూలై 8న  వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి  వై.ఎస్. విజయమ్మ రాజీనామా సమర్పించారు

also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

అయితే  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  వై.ఎస్. షర్మిల కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే  వై.ఎస్. విజయమ్మ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం అంతా  ఆసక్తిగా చూస్తున్నారు. 

also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ  కారణంగానే అప్పట్లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యారని  ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  సోనియాతో పాటు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేశారు.  కూతురు వై.ఎస్. షర్మిలకు తోడుగా ఉంటానని ప్రకటించిన వై.ఎస్. విజయమ్మ  షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమెకు అండగా నిలుస్తారా, వెనక్కు తగ్గుతారా అనేది  తేలాల్సి ఉంది.

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..

కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరినందనే కారణంగా కొడుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా అనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది.  ఈ ప్రశ్నలకు త్వరలోనే  సమాధానం దొరికే అవకాశం ఉందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు

also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

click me!