IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం

Published : Jan 13, 2026, 07:00 AM IST

IMD Rain Alert : హిందూమహాసముద్రంలో ఏర్పడిన కోజి తుపాను ఆస్ట్రేలియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇండియాలో వర్షాలు కురుస్తున్నాయి. 

PREV
16
హిందూ మహాసముద్రంలో తుపాను

Cyclone Koji : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలహీనపడటంతో తుపాను ముప్పు తప్పింది... లేదంటే దక్షిణ భారతదేశంతో పాటు శ్రీలంకలో భారీ వర్షాలు కురిసేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా బంగాళాఖాతంలో తుపాను ప్రమాదం తప్పినా హిందూ మహాసముద్రంలో మరో తుపాను ఏర్పడింది... సైక్లోన్ కోజి ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియాలోని నార్త్ ఈస్ట్ స్టేట్ క్వీన్స్ ల్యాండ్ లో ఈ తుపాను తీరం దాటింది... దీంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

26
అత్యంత భారీ వర్షాలు

కోజి తుపాను ప్రభావంతో ఏకంగా 200 మిల్లి మీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. క్వీన్ ల్యాండ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయని.. అలాగే 95kmh వేగంతో ఈదురుగాలుల వీస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తుపాను దాటికి 15,000 లకు పైగా ఇళ్లకు కరెంట్ నిలిచిపోయి ప్రజలు చీకట్లో గడుపుతున్నారు... తీరప్రాంతంలో ఇళ్లు, పడవలు ధ్వంసం అయినట్లు అధికారులు చెబుతున్నారు.

36
దక్షిణాదిన వర్షాలు

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చెరి, కారైకల్ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కడలూరు, అరియలూర్, మైలదుత్తురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుక్కోట్టై జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనవరి 14 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

46
ఏపీలో కూడా వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కప్పివుండి చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

56
తెలంగాణలో తగ్గిన చలి

తెలంగాణ విషయానికి వస్తే డిసెంబర్ నుండి కొనసాగుతున్న చలిగాలుల తీవ్రత తగ్గింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలోనూ నమోదుకావడంలేదు.. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 10 డిగ్రీల టెంపరేచర్ ఉంటోంది. మెదక్ లో 12.4, నల్గొండలొ 14.2, నిజామాబాద్ లో 14.8, రామగుండంలో 17, ఖమ్మంలో 18.2, హన్మకొండలొ 17.5, భద్రాచలంలో 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

66
హైదరాబాద్ వెదర్

హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గింది. పటాన్ చెరులో 15.2, రాజేంద్ర నగర్ లో 18.5, హయత్ నగర్ లో 18, హకీంపేటలో 19.4, బేగంపేటలో 20.1, దుండిగల్ లో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా హైదరాబాద్ లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 20.1 డిగ్రీలుగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories