Tirupati: తిరుమలలో రీల్స్ చేస్తే జైలుకే.. టీటీడీ వార్నింగ్

Published : Jul 31, 2025, 11:39 PM ISTUpdated : Aug 01, 2025, 11:42 AM IST

Tirumala Tirupati Devasthanams: తిరుమల ఆలయం వద్ద రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) హెచ్చరించింది. భక్తుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

PREV
15
తిరుమలలో పవిత్రతను దెబ్బతీసే రీల్స్ పై టీటీడీ ఉక్కుపాదం

ఇటీవలకాలంలో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కొంతమంది యూత్ సోషల్ మీడియా రీల్స్ కోసం వెకిలి చేష్టలు చేస్తూ వీడియోలు తీస్తున్న దృశ్యాలు టీటీడీ దృష్టికి వచ్చాయి. ఆలయం మాడ వీధుల్లో డాన్సులు, అభ్యంతరకర పోజులు, హాస్యాస్పద ప్రదర్శనలతో వీడియోలు తీస్తూ వాటిని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో పోస్టు చేస్తున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా టీటీడీ పేర్కొంది. ఈ మేరకు టీటీడీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

DID YOU KNOW ?
తిరుమల ఆలయ పరిధిలో ఫోటోలు, వీడియోలపై నిషేధం
తిరుమలలో ఆలయ పరిధిలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు అనుమతి లేదు. అలిపిరి దాటి శ్రీవారి ఆలయం పరిసరాలలో రీల్స్ చేస్తే టీటీడీ క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటుంది.
25
తిరుమల ఆధ్యాత్మికతకు భంగం క‌లిగిస్తే తీవ్ర చ‌ర్య‌లు: టీటీడీ హెచ్చరిక

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్న టీటీడీ అధికారులు.. ఈ రకమైన వీడియోలు ఆలయ పవిత్రతను అపహాస్యం చేయడమేనని తీవ్రంగా ఖండించారు. శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో ఈ తరహా రీల్స్‌ చేసిన వారిని గుర్తించి, వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.

35
ఆలయ నియమాలు ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న టీటీడీ

టీటీడీ విజిలెన్స్ విభాగం, భద్రతా సిబ్బంది ఆలయ పరిసరాల్లో 24/7 నిఘా పెట్టారు. ఎవరు వీడియోలు తీయడాన్ని ప్రయత్నించినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా చర్యలు ముమ్మరంగా చేపట్టారు. 

ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు, ఫైన్‌లు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్క‌డి ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం, ప‌విత్ర‌త‌ను, గౌరవాన్ని తగ్గించే దిశగా రీల్స్ చేయ‌డం పై టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది.

45
తిరుమలలో కొత్త పాలసీలు.. పర్యావరణ పరిరక్షణకు చర్యలు

టీటీడీ అధికారులు రీల్స్ నిషేధంతో పాటు వాహనాల నియంత్రణపై కూడా కసరత్తు మొదలుపెట్టారు. తిరుమలలో పాత వాహనాల వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక పార్కింగ్, ప్రీ పెయిడ్ టాక్సీల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు కనిష్ట, గరిష్ఠ ఛార్జీలు నిర్ణయించనున్నారు.

55
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలి

తిరుమలలో ప్రతి అడుగు భక్తి మయంగా ఉండాలి కానీ, ఆధ్యాత్మికతను అపహాస్యం చేసే చర్యలు తగవని టీటీడీ హెచ్చరించింది. తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories