Railway : ఆంధ్ర ప్రదేశ్ లో నడిచే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదే.. ఎక్కడి నుండి ఎక్కడికి, ఎంత స్పీడ్?

Published : Jul 31, 2025, 05:50 PM IST

Vande Bharat Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే హైస్పీడ్ ట్రైన్ ఏదో తెలుసా? ఏపీలో కూడా ఈ రైలే అత్యధిక వేగం కలిగినది. ఇంతకూ ఈ ట్రైన్ సర్వీస్ ఏదంటే… 

PREV
15
ఏపీలో అత్యంత వేగవంతమైన రైలు

Fastest Train in Andhra Pradesh :  రైలుపై వచ్చిన ప్రతి సినిమాపాట తెలుగువారికి ఆకట్టుకుంది... రైల్లోనే కథంతా సాగే సినిమాలున్నాయి. ఇక చుక్ చుక్ రైలు వస్తోంది అంటూ సాగే చిన్నారుల పాటలు కూడా ఉన్నాయి. ఇదిచాలదా తెలుగోళ్లు రైల్వే ప్రయాణమంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. రైలు ప్రయాణం తెలుగు ప్రజలకు ఓ ఎమోషన్.

అలా రైలు పట్టాలపై వేగంగా దూసుకెళుతుంటే డోర్ దగ్గర నిలబడో, కిటికీలోంచో ప్రకృతి అందాలను చూస్తూ చాలామంది ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా రైల్వే ప్రయాణం సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉన్నా ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. దీంతో ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు ఇండియన్ రైల్వేస్ హైస్పీడ్ రైళ్లను తీసుకువచ్చింది... అవే వందేభారత్ ఎక్స్ ప్రెస్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలమధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాయి ఈ వందే భారత్ ట్రైన్స్. ఇలా తెలుగు రాష్ట్రాలమధ్య కూడా వందేభారత్ పరుగులు తీస్తోంది... విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఈ సర్వీస్ నడుస్తోంది. ఇదే ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత వేగంగా నడిచే రైలు... దీంట్లో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

DID YOU KNOW ?
భారత్ లో బుల్లెట్ ట్రైన్
అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ ట్రైన్స్ త్వరలోనే భారత్ లో పరుగు తీయనున్నాయి. దీని వేగం గంటకు 320 కిలోమీటర్లు. ముంబై, అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ రైలు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
25
వైజాగ్ - సికింద్రబాద్ వందేభారత్ స్పీడ్ ఎంత?

భారతదేశంలో ప్రస్తుతం అత్యంత వేగంగా నడిచే రైళ్ళు వందేభారత్. వీటి స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లకు పైనే... కానీ ఆపరేషనల్ స్పీడ్ గంటకు 150 లోపే ఉంటుంది. దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగుతీస్తోంది.

విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల మధ్య 699 కిలోమీటర్ల దూరాన్ని వందేభారత్ రైలు కేవలం 8 గంటల 30 నిమిషాల్లోనే పూర్తిచేస్తుంది. అంటే ఈ రైలు గంటకు 82 కి.మీ వేగంలో వెళుతుందన్నమాట. తెలంగాణ, ఏపీలోని రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణసమయాన్ని తగ్గిస్తూ ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది.

హైదరాబాద్ - విశాఖపట్నం మధ్యలో మరికొన్ని ప్రాంతాలను కూడా ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. విజయవాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, వరంగల్, ఖమ్మంల మీదుగా ఈ వందేభారత్ ప్రయాణం సాగుతుంది. ప్రతిరోజు ఈ వందేభారత్ ట్రైన్ నడుస్తుంది.

35
ఏపీలో మరిన్ని వందేభారత్ సర్వీసులు

కేవలం విశాఖపట్నం - హైదరాబాద్ మాత్రమే కాదు ఏపీలోని మరికొన్ని నగరాలకు కూడా వందేభారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇలా విజయవాడ నుండి తమిళనాడు రాజధాని చెన్నైకి వందేభారత్ సర్వీస్ ఉంది. అలాగే హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే మరో వందేభారత్ ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రయాణం సాగిస్తుంది. ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం సౌకర్యంగానూ, వేగంగాను ఉంటుంది.

45
తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఫాస్టెస్ట్ రైలు ఏదో తెలుసా?

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లలోనూ హైదరాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగవంతమైనది. ఇరురాష్ట్రాల మధ్య నడిచే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదే. ఈ వందేభారత్ రైలు గంటకు 82 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించేవారికి సమయం ఆదా అవుతోంది.

ఇక వందేభారత్ కాకుండా దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్. ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ, దేశ రాజధాని న్యూడిల్లీ మధ్య నడుస్తుంది. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. తర్వాత బోపాల్ శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్ ప్రెస్ లు అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. వీటన్నింటి స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు పైనే ఉంటుంది.

55
విశాఖపట్నం - శంషాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్

ఆంధ్ర ప్రదేశ్ ను హైదరాబాద్ తో కనెక్ట్ చేసే ఓ రైల్వే ప్రాజెక్ట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుండి శంషాబాద్ కు సెమి హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు రైల్వే శాఖ సిద్దమయ్యింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏకంగా గంటకు 220 కి.మీ వేగంతో రైలు ప్రయాణం సాగుతుంది.

హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య మధ్య 600 కి.మీ పైగా దూరం ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య జర్నీకి 10-12 గంటల సమయం పడుతుంది. అయితే విశాఖ-శంషాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణం మూడు నాలుగు గంటల్లోనే పూర్తవుతుంది... ప్రయాణ సమయం చాలా ఆదా అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories