పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

First Published Dec 21, 2023, 2:47 PM IST

2024 పార్లమెంట్ ఎన్నికలకు  తెలుగుదేశం, జనసేన పార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ప్రజలకు ఇచ్చే హామీలపై  త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయి. 

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికను పంచుకోవడం దాదాపు  పదేళ్లు అవుతుంది.  యువగళం ముగింపును పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన  విజయనగరం జిల్లాలో పోలిపల్లిలో  నిర్వహించిన  భారీ బహిరంగ సభలో  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు

also read:జగదీష్ రెడ్డి సవాల్, రేవంత్ సై: ఛత్తీస్ ఘడ్... భద్రాద్రి, యాద్రాద్రి పవర్ ప్లాంట్లపై జ్యుడీషియల్ విచారణ

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

2014 ఎన్నికలకు ముందు  హైద్రాబాద్ లో జరిగిన ఎన్నికల సభలో  నరేంద్ర మోడీ,  నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు.2014 ఎన్నికలకు ముందు  జనసేనను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో  చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. 2014 ఎన్నికల్లో  తమ పార్టీకి మద్దతివ్వాలని  చంద్రబాబు నాయుడు కోరారు.  ఆ ఎన్నికల్లో  తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

2014 ఎన్నికల్లో  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీ తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని పంచుకుంది.  కేంద్రంలో  బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలో భాగస్వామింగా మారింది.

also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు
 

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశంతో సమానమైన ప్యాకేజీకి  తెలుగుదేశం అంగీకరించింది.ఆ సమయంలో అప్పట్లో విపక్షాలు తెలుగుదేశంపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రత్యేక హోదానే కావాలని  జనసేన కూడ డిమాండ్ చేసింది. ఆనాడు తెలుగుదేశం అనుసరించిన విధానాలపై  విబేధించి  ఆ పార్టీతో  దూరమైంది

also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

2019 ఎన్నికల్లో  జనసేన  పార్టీ  సీపీఐ, సీపీఐఎం, బీఎస్‌పీలతో కలిసి పోటీ చేసింది.  అయితే ఈ ఎన్నికల్లో  జనసేన ఒకే ఒక్క స్థానంలోనే విజయం సాధించింది . ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై  వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. 

also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?
 

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో  జనసేన పొత్తు పెట్టుకుంది.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ పొత్తు కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే  ఆ తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జనసేన కీలకపాత్ర పోషించనుందని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  2021లో  ప్రకటించారు.

also read:మేడిగడ్డ బ్యారేజీ: బీఆర్ఎస్‌ను చక్రబంధంలోకి నెడుతున్న కాంగ్రెస్

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని జనసేనాని భావిస్తున్నాడు. ఈ తరుణంలో చంద్రబాబును  వై.ఎస్. జగన్ సర్కార్  ఈ ఏడాది సెప్టెంబర్  9వ తేదీన అరెస్ట్ చేసింది.   ఈ అరెస్ట్ కు ముందే  చంద్రబాబు పర్యటనల సమయంలో,  పవన్ కళ్యాణ్ పర్యటనలను  జగన్ సర్కార్ అడ్డుకుంది. ఈ సమయాల్లో  ఇరువురు నేతలు  కలిశారు. 

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

 అరెస్టై జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్  రాజమండ్రి జైల్లో  చంద్రబాబును కలిశారు.  2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.  ఈ దిశగా  ఈ రెండు పార్టీలు  కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి. 

also read:1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని నిన్న విజయనగరం జిల్లా పోలిపల్లిలో  భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడ పాల్గొన్నారు.  2014 తర్వాత 2023 డిసెంబర్ 20వ తేదీన జరిగిన సభలోనే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై  కలిశారు. 2014 నాటి ఫలితాలు పునరావృతం కానున్నాయని  తెలుగుదేశం పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. 2014 నాటి  ఘటనలే వరుసగా జరుగుతున్నాయి. 2014 సెంటిమెంట్ పునరావృతం కానుందని ఆ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. 

also read:నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

రానున్న రోజుల్లో  తిరుపతి, విజయవాడల్లో కూడ  సభలు ఏర్పాటు చేయనున్నారు.ఈ సభల్లో  పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొంటారు.ఈ సభల్లో  రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను  విడుదల చేయనున్నారు.  మరో వైపు రెండు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేందుకు వీలుగా  సమన్వయ కమిటీలను కూడ ఏర్పాటు చేశారు. 

also read:వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

click me!