వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

First Published Dec 15, 2023, 7:22 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం ఉన్నందున  అసెంబ్లీ ఇంచార్జీలను ఎన్నికల షెడ్యూల్ కు ముందే మార్చాలని  జగన్ ప్లాన్ చేస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి నిర్ణీత షెడ్యూల్ కంటే  ముందే ఎన్నికలు జరగనున్నాయి.  గతంతో పోలిస్తే  15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.శుక్రవారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్  కేబినెట్  సమావేశంలో  ఈ విషయాన్ని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే.

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున  ఇంచార్జీలను మార్చాలని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఇప్పటికే  11 మంది అసెంబ్లీ ఇంచార్జీలను మార్చారు వై.ఎస్. జగన్.రానున్న రోజుల్లో  మరిన్ని నియోజకవర్గాలకు  ఇంచార్జీలను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో  ప్రచారం సాగుతుంది.

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

2019లో మార్చి  10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.  ఏప్రిల్  11న పోలింగ్ జరిగింది.  మే 23న  ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో  మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) వ్యూహంతో  ముందుకు వెళ్తుంది.2019 ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ  151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.  వచ్చే ఎన్నికల్లో  175  అసెంబ్లీ స్థానాల్లో  విజయం సాధించాలనే వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్తుంది.  ప్రజల్లో వ్యతిరేకత ఉన్న  సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  సిట్టింగ్ ల్లో  9 మందిని మార్చారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.  అయితే  అభ్యర్థులను మార్చిన స్థానాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు విజయం సాధించారు.  పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చితే  ఫలితాలు మరోలా ఉండేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 
 
వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  15 నుండి 20 రోజుల ముందే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై  ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం జగన్ మంత్రులకు తెలిపారు.

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 40 నుండి 50 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చాలని జగన్ భావిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరికి నియోజకవర్గాలు మార్చడం, మరికొందరికి టిక్కెట్లు కేటాయించే అవకాశం లేదు.  మరో వైపు  విజయావకాశాలున్నవారికి టిక్కెట్లు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ...

అయితే అభ్యర్థులను మార్చితే  విజయం సాధ్యమౌతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో  బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చింది. కానీ బీజేపీ కర్ణాటకలో విజయం సాధించలేదు.  కేరళలో సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చింది. ప్రస్తుతం విజయన్ మంత్రివర్గంలో  విజయన్ మినహా మిగిలినవారంతా కొత్తవాళ్లే.  కేరళలో  రెండోసారి సీపీఐ(ఎం) విజయం సాధించింది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీ ఇంచార్జీల మార్పు ఏ మేరకు  ఫలితాలను  ఇవ్వనుందో  భవిష్యత్తు తేల్చనుంది.

click me!