వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

First Published | Dec 20, 2023, 12:55 PM IST

2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు  వైఎస్ఆర్‌సీపీ  అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  కసరత్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు కేటాయించనున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ  ముందుకు వెళ్తుంది. అయితే లక్ష్య సాధనలో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేమని  సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఇప్పటికే  రాష్ట్రంలోని  20 మంది ఎమ్మెల్యేలు సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేమని తేల్చారు. మరికొందరి నియోజకవర్గాలు మార్చారు. మరికొందరిని ఎంపీలుగా పంపనున్నారు. ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని  సీఎం వై.ఎస్. జగన్ కోరుతున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో  తొమ్మిది మందిని మార్చారు.ఈ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే  బీఆర్ఎస్ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలుండేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఇప్పటికే  11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అభ్యర్థులను  వైఎస్ఆర్‌సీపీ మార్చింది.  మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఈ తరుణంలోనే  పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఏ కారణంతో  అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చాల్సి వస్తుందో, ఏ కారణంగా ఎంపీ స్థానానికి లేదా ఎంపీ స్థానానికి పంపాల్సి వస్తుందో  నేతలకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా  ముందుకు వెళ్లాల్సిన తరుణంలో  మార్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని  కూడ  సీఎం జగన్ వివరిస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఇప్పటికే  పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే, పెండెం దొరబాబు, జగ్గంపేట జ్యోతుల చం,టి బాబు, రామచంద్రాపురం చెల్లుబోయిన వేణు
కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు,  అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రాజోలు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా,విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఈ నెల  20న కూడ  చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో సమావేశం కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.  రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను ఎంపీగా కాకుండా  రాజమండ్రి సిటీ నుండి పోటీ చేయించాలని  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.ఈ మేరకు  సీఎంఓ పిలుపు మేరకు  మార్గాని భరత్ కూడ  ఇవాళ తాడేపల్లికి చేరుకున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాలపై వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల పనితీరుపై  సర్వే నిర్వహించారు  సీఎం వై.ఎస్. జగన్.  10 సంస్థలతో  సర్వే నిర్వహించారు.ఈ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై  జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  ప్రత్తిపాడులో వి. సుబ్బారావుకు  టిక్కెట్టు కేటాయించాలని  జగన్ భావిస్తున్నారు. ఈ స్థానంలో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 
జగ్గంపేట తోట నరసింహం కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అయితే  ఈ స్థానంలో  జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.తోట నరసింహం కుటుంబానికి టిక్కెట్టు ఇస్తే  జ్యోతుల చంటిబాబు  సహకరిస్తారా లేదా అనేది  చర్చ సాగుతుంది.  

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

మరోవైపు పిఠారం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును  ఎంపీగా పోటీ చేయాలని  జగన్ ప్రతిపాదిస్తున్నారని ప్రచారం సాగుతుంది.  అయితే  ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు  దొరబాబు సానుకూలంగా ఉన్నారని  ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నెల 22న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన రెండో జాబితాను  వైఎస్ఆర్‌సీపీ ప్రకటించే అవకాశం ఉంది.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం , వైఎస్ఆర్‌సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వైఎస్ఆర్ఎస్‌పీ బరిలోకి దిగనుంది. వచ్చే ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించడంపై వైఎస్ఆర్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  దీంతో  గెలుపు గుర్రాలకే  టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. 

Latest Videos

click me!