నీట మునిగిన వేల హెక్టార్ల పంటలు.. డ్రోన్లతో నష్టం గుర్తింపు
గడచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి వర్షాలపై హెచ్చరిక సందేశాలు పంపించామన్నారు.
2,703 జనరేటర్లు, 81 వైర్‌లెస్ కమ్యూనికేషన్ టవర్లు, యాప్ ద్వారా పర్యవేక్షణలో ఉన్న యంత్ర పరికరాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలు, చెట్లు, టవర్లు, హోర్డింగ్‌లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వర్షాలతో 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో పంట నష్టాలు నమోదయ్యాయని చెప్పారు. రైతులు నష్టం వివరాలు యాప్ ద్వారా పంపేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు.