ఏ రైలు రద్దయ్యింది.. ఏది నడుస్తోంది? : ఇలా ఈజీగా తెలుసుకొండి

Published : Oct 28, 2025, 04:24 PM IST

Trains Cancelled in Andhra Pradesh : మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఏపీలో అనేక రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. ఏ రైలు రద్దయ్యింది? ఏది నడుస్తుంది? అనేది తెలుసుకోవాలంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 

PREV
17
మొంథా తుపాను ఎఫెక్ట్... రైల్వే సర్వీసులకు అంతరాయం

Cyclone Montha : ఆంధ్ర ప్రదేశ్ ను మొంథా తుపాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే తుపాను తీరంవైపు దూసుకువస్తోంది... ఇవాళ (మంగళవారం) రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరింత జోరందుకుని భారీ, అతిభారీ వర్షాలుగా మారతాయని... వీటికి ఈదురుగాలులు తోడై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది. దీంతో అప్రమత్తమైన రైల్వే, విమానయాన అధికారులు ఏపీకి నడిచే సర్వీసులను రద్దు చేశారు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

27
రైల్వే ప్రయాణికులారా... ముందు ఇది తెలుసుకొండి

ఇప్పటికే బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర తుపానుగా మారింది... దీంతో నిన్నమొన్నటితో పోలిస్తే వర్షతీవ్రత పెరిగింది. అయితే ఇవాళ(అక్టోబర్ 28) రాత్రి ఈ తుపాను తీరందాటనుంది... దీంతో కుంభవృష్టి ప్రారంభం అవుతుందని... తీరంవెంబడి గంటకు 90-110 వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. బుధవారం  మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందన్న హెచ్చరికలతో అక్టోబర్ 28 తో పాటు అక్టోబర్ 29న కూడా ఏపీలో నడిచే పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.

37
ఏపీలో రైలు సర్వీసులు రద్దు

విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో నడిచే అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. అలాగే రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కాకినాడల మీదుగా చెన్నై, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరుకు నడిచే అనేక రైళ్ళను రద్దుచేశారు. ఏపీ మీదుగా వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్ళే కాదు ఎక్స్ ప్రెస్ లు కూడా ఇవాళ, రేపు (మంగళ, బుధవారం) నడవవని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.

47
రైల్వే సమాచారం కోసం హెల్ప్ డెస్క్ లు

అయితే రైళ్ళ రద్దుతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఏ రైలు రద్దయ్యింది... ఏ రైలు నడుస్తుంది అనేది తెలియక ఇబ్బందపడే అవకాశాలున్నాయి. అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటుచేసింది... వీటికి ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయించింది. కాబట్టి ప్రయాణికులు రైల్వేకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా ఈ హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి క్లారిటీ పొందవచ్చని రైల్వే శాఖ చెబుతోంది.

57
ప్రధాన రైల్వేస్టేషన్ల హెల్ప్‌డెస్క్‌ ఫోన్ నెంబర్లివే

విజయవాడ - 0866 2575167

నెల్లూరు - 90633 47961

గూడూరు - 08624 250795

ఒంగోలు - 78159 09489

బాపట్ల - 78159 09329

తెనాలి - 78159 09463

ఏలూరు - 75693 05268

రాజమండ్రి - 83319 87657

సామర్లకోట - 73823 83188

తుని - 78159 09479

అనకాపల్లి - 75693 05669

భీమవరం - 78159 09402

గుడివాడ - 78159 09462

67
విమాన సర్వీసులు రద్దు

మొంథా తుపాను ప్రభావం విశాఖపట్నంపై చాలా గట్టిగా ఉంది... ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుపాను తీరం దాటితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో... అందుకే ముందుజాగ్రత్తగా అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇలా మొత్తం 36 విమాన సర్వీసులను రద్దయ్యాయి. ఇక విజయవాడ విమానాశ్రయం నుండి నడిచే ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. పరిస్థితిని బట్టి విమాన సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు.

77
ఏపీ ప్రజలు కాల్ చేయాల్సిన నంబర్లివే

అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కొన్ని నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఇలా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కంట్రోల్ రూం నెంబర్లు 112 లేదా 1070 లేదా 18004250101 ఫోన్ చేయవచ్చు. లేదా జిల్లాల వారిగా కూడా హెల్ప్ లైన్ నెంబర్లకు ప్రకటించారు.

శ్రీకాకుళం - 08942-240557

విజయనగరం - 08922-236947

విశాఖపట్నం - 0891-2590102 లేదా డయల్ 100

అనకాపల్లి - 08924-222888

కాకినాడ - 0884-2356801

కోనసీమ - 08856-293104

పశ్చిమ గోదావరి - 08816299181

కృష్ణా జిల్లా -08672252572

బాపట్ల : 08643-220226

ప్రకాశం - 98497 64896

నెల్లూరు - 08612331261 లేదా 7995576699

తిరుపతి - 0877-2236007

Read more Photos on
click me!

Recommended Stories