ఈ ప్రాంతాల్లో భూములున్న వారి పంట పండిన‌ట్లే.. రూ. 34 వేల కోట్లతో ఊహ‌కంద‌ని అభివృద్ధి

Published : Feb 14, 2026, 02:25 PM IST

AP Budget: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ రూ. 3,32,205 కోట్ల వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇందులో ఏపీలోని రెండు ప్రాంతాల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 

PREV
15
స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ నిర్మాణంలో అభివృద్ధి, మౌలిక వసతులు, పరిశ్రమలు, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యం ఇచ్చారు. రాజధాని అభివృద్ధి, ప్రాంతీయ ఆర్థిక జోన్లు, పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన అజెండాగా నిలిచాయి.

25
అమరావతి అభివృద్ధి – రాజధానికి కొత్త ఊపు

రాజధాని అమ‌రావ‌తి నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కోసం రూ.6,000 కోట్లు కేటాయించారు. రహదారులు, పరిపాలనా భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నీటి-విద్యుత్ సదుపాయాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించనున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం (AER) పరిధిలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలను కలిపి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు చేయనున్నారు. రాజధాని చుట్టుపక్కల జిల్లాల సహజ వనరులను వినియోగించి పరిశ్రమలు, ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, హెల్త్‌కేర్ హబ్‌లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ఫలితంగా భూముల విలువలు పెరగడం, కమర్షియల్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందడం, కొత్త టౌన్‌షిప్‌లు రూపుదిద్దుకోవడం వంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉంది.

35
విశాఖ ఆర్థిక ప్రాంతం – ఉత్తరాంధ్రకు పారిశ్రామిక శక్తి

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా విశాఖ ప్రాంతీయ ఆర్థిక జోన్ (VER) కోసం రూ.28,000 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న పది జిల్లాలను ఈ ఆర్థిక మండలంలో చేర్చారు. తయారీ, సేవారంగం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు వంటి ఏడు కీలక రంగాల్లో 41 ప్రధాన ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్, లాజిస్టిక్స్ హబ్‌లు, ఐటీ, ఫార్మా పార్కులు ఈ ప్రణాళికలో ముఖ్య భాగాలు. ఈ చర్యలతో ఉత్తరాంధ్రలో భారీగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వాణిజ్య కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.

45
పెట్టుబడులు, మౌలిక వసతులు

అమరావతి, విశాఖ ప్రాంతాలను వృద్ధి ఇంజిన్లుగా తీర్చిదిద్దే క్రమంలో రోడ్లు, మెట్రో రైలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా నిధులు సమీకరించనున్నారు. పారిశ్రామిక పార్కులు, స్టార్టప్ హబ్‌లు, ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలన్నది లక్ష్యం. ఈ వ్యూహం వల్ల రెండు ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఏర్పడనుంది.

55
రియల్ ఎస్టేట్, ఉపాధిపై ప్రభావం

ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊపును తీసుకురానున్నాయి. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు రావడం వల్ల నివాస అవసరం పెరుగుతుంది. విశాఖలో పారిశ్రామిక పెట్టుబడులు, మెట్రో ప్రాజెక్ట్ అమలుతో కమర్షియల్ స్థలాల డిమాండ్ పెరుగుతుంది. పరిసర గ్రామాలు, ఉపనగరాలు వేగంగా పట్టణాలుగా మారే అవకాశముంది. ఉద్యోగావకాశాలు పెరగడం, చిన్న వ్యాపారాలు విస్తరించడం, సేవారంగం అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక చైతన్యం పెరగనుంది అనేది కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం. మ‌రి ఈ ప్ర‌ణాళికలు ఏమేర కార్య‌రూపం దాల్చుతాయో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories