Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు

Published : Feb 13, 2026, 10:05 AM IST

Real estate: కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్ల అమ‌రావ‌తి అభివృద్ధి వేగ‌వంత‌మైంది. ఈ క్ర‌మంలోనే ఐటీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారుతోంది. 

PREV
15
మంగళగిరిలో పెరుగుతోన్న ఐటీ కంపెనీలు

మంగళగిరి పరిసరాల్లో ఐటీ కంపెనీలు వేగంగా స్థిరపడుతున్నాయి. బీపీఓ, కేపీఓ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)ను అభివృద్ధి చేసింది. దీంతో దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇవి భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. ఐటీ రంగం పెరిగితే అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

25
ఉపాధి అవ‌కాశాలు పెరిగే అవ‌కాశం

డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఏర్పడటం వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఐటీ రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం కృత్రిమ మేథస్సు (AI) కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తోంది. దీని వల్ల వచ్చే ఐదు నుండి పది సంవత్సరాల్లో మంగళగిరి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

35
రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న డిమాండ్

ఐటీ కంపెనీలు వస్తే నివాస ప్రాంతాల అవసరం పెరుగుతుంది. ఉద్యోగుల కోసం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య భవనాలు అవసరం అవుతాయి. దీంతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి క‌నిపిస్తోంది. రాబోయే కాలంలో ఇక్కడ గృహ నిర్మాణ ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

45
అమరావతిని గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీడ్ క్యాపిటల్ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో మొత్తం ఏడు నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటి ప్రత్యేక ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటుంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

55
హైదరాబాద్, బెంగళూరు మాదిరి అభివృద్ధి సాధ్యమా?

ప్రపంచంలోని పెద్ద నగరాల అభివృద్ధికి ఐటీ రంగం ప్రధాన కారణంగా నిలిచింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, అలాగే బెంగళూరు, పుణే వంటి నగరాలు ఐటీ కంపెనీల వల్ల వేగంగా ఎదిగాయి. అదే విధంగా మంగళగిరి కూడా ఐటీ రంగం ఆధారంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే, మంగళగిరి అమరావతిలో కీలక ఐటీ కేంద్రంగా మారే అవకాశముంది.

మొత్తం మీద‌ మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే భవిష్యత్‌లో ఇది మ‌రో సైబ‌ర్ సిటీగా మారే అవకాశం కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, స్టార్టప్‌లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అన్నీ క‌లిపి ఈ ప్రాంతాన్ని వేగంగా మార్చనున్నాయ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories