అల్పపీడన ప్రభావం.. తెలంగాణ వాతావరణం ఎలా ఉందంటే?
ఇదివరకే ఏర్పడిన ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 16 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ఆగస్టు 9 నుంచి 12 మధ్య గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే జల్లులు పడ్డాయి. ఆగస్టు 12 తర్వాత వర్షాలు ఉన్నా పెద్దగా ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు.