Tirumala : ఒకేరోజు రెండుసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు? ఎలాగో తెలుసా?

Published : Aug 08, 2026, 01:04 PM ISTUpdated : Aug 08, 2026, 01:12 PM IST

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామిని ఏ ఆర్నేళ్లకో, ఏడాదికో ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ పావనం అయ్యిందని భక్తులు భావిస్తారు. అలాంటిది ఒకేరోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం లభిస్తే..! ఇలాంటి అవకాశమే భక్తులకు కల్పిస్తోంది టిటిడి.

PREV
15
ఆగస్ట్ 21న తిరుమల పుష్ఫయగం టికెట్లు విడుదల

వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాదికి సంబంధించిన పుష్పయాగ సేవ టికెట్లను ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పుష్పయాగ సేవ నవంబర్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది. దీనికి ఒకరోజు ముందు అంటే నవంబర్ 15న అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రత్యేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల తర్వాత శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు వంటివి తొలగిపోయి, సమస్త జీవరాశులు బాగుండాలని కోరుతూ ఈ పుష్పయాగ సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

25
పుష్పయాగం టికెట్ ధర ఎంత?

పుష్పయాగ సేవలో పాల్గొనేందుకు ఒక్కో భక్తుడికి టికెట్ ధరను టీటీడీ రూ.700గా నిర్ణయించింది. ఈ యాగంలో మొత్తం వెయ్యి మంది భక్తులకు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. తిరుమల లేదా తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం ఉండదు.

ఒక మొబైల్ నంబర్‌పై రెండు పుష్షయాగం టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది. దంపతులు, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు కలిసి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 12 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. కానీ 12 ఏళ్లు దాటిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఆధార్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డు వివరాలు అందించాలి. అయితేనే ఈ యాగంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

35
ఒకే రోజు రెండుసార్లు దర్శనం

ఈ పుష్పయాగ సేవలో పాల్గొనే భక్తులకు ఒకే రోజు రెండుసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఉదయం సేవలకు హాజరైనప్పుడు ఒకసారి, పుష్పయాగ సేవ ముగిసిన తర్వాత మరోసారి స్వామివారి దర్శనం లభిస్తుంది. ఈ రెండు దర్శనాలు కూడా తిరుమల ఆలయంలోని జయవిజయ ద్వారం నుంచే కల్పిస్తారు. ఇలా ఒకేరోజు రెండుసార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది... కాబట్టి మీకు అవకాశం దక్కాలంటే ఈ నెలలో విడుదలయ్యే పుష్పయాగం టికెట్లు పొందండి.

45
శ్రీవారి పుష్పయాగం నిబంధనలివే..

అయితే ఈ పుష్పయాగ సేవ టికెట్లు బుక్ చేసుకునే భక్తులకు టీటీడీ ఒక నిబంధన పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 16వ తేదీకి ముందు అంటే గత 180 రోజుల్లోపు ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు ఈ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, వసంతోత్సవం, పవిత్రోత్సవం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఇది వర్తిస్తుంది. రూ.300 దర్శన టికెట్ పొందిన వారికి, వర్చువల్ సేవల్లో పాల్గొన్నవారికి లేదా లక్కీ డిప్ ద్వారా వివిధ సేవల్లో పాల్గొన్న భక్తులకు ఈ నిబంధన వర్తించదు. ఈ 180 రోజుల గడువును టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి కాకుండా, సేవలో పాల్గొన్న తేదీ నుంచి లెక్కిస్తారు.

55
పుష్పయాగం టికెట్ ఇలా బుక్ చేసుకొండి

ఈనెల ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల కానున్న నేపథ్యంలో భక్తులు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండాలి. టికెట్ల సంఖ్య పరిమితంగా ఉన్నందున విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి.. కాబట్టి అన్ని వివరాలు సిద్దంగా ఉంచుకుని విడుదలైన వెంటనే టికెట్లు పొందాలి. ఏమాత్రం ఆలస్యం అయినా టికెట్లు లభించవు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో అర్చకుల వేదమంత్రాలు, సువాసనభరితమైన పుష్పాలతో ఈ పుష్ఫయాగం జరుగుతుంది. ఇలా శ్రీవారికి జరిగే ఈ విశేష సేవను కళ్లారా చూసే అవకాశం భక్తులకు కల్పిస్తోంది టిటిడి. ఈ సేవలో పాల్గొనడమే కాదు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం పొందే ఈ ప్రత్యేక అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories