ఈ స్కీమ్ కింద ఒక్కో స్టూడెంట్‌కి రూ.15,000 ఆమోదించినప్పటికీ, రూ.13,000 తల్లుల ఖాతాలో పడతాయి. పథకం పూర్తి ప్రయోజనం పొందాలంటే ఈ కింది ఎలిజిబిలిటీ క్రైటీరియా తప్పకుండా ఉండాలి..
• కుటుంబానికి 10 ఎకరాలకు మించి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు.
• వైట్ రేషన్ కార్డ్ ఉండాలి.
• ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఎలాంటి ఫోర్ వీలర్ ఉండకూడదు.
• కరెంట్ బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకుండా ఉండాలి.
• ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు అయి ఉండకూడదు.
• టౌన్స్‌లో 1,000 స్క్వేర్ ఫీట్ కంటే పెద్ద ఇల్లు కానీ, స్థలం కానీ ఉండకూడదు.
• మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి Scheme Eligibility Check అధికారిక పోర్టల్ ద్వారా మీ ఆధార్ నంబర్ నమోదు చేసి వివరాలు పరిశీలించుకోవచ్చు.