Viral Michelin Restaurant Menu: గుటుక్కున మింగే బటర్ ఫ్లై, పురుగుల ఐస్ క్రీమ్ అంటూ మిచెలిన్ రెస్టారెంట్ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Michelin restaurant menu is going viral: మిచెలిన్ స్టార్ రెస్టారెంట్ చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా మిచెలిన్ రెస్టారెంట్ బ్రాంచ్‌లు చాలా ఉన్నాయి. అయితే, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లోని మిచెలిన్ స్టార్ రెస్టారెంట్‌లో వడ్డించిన డిఫరెంట్ మెనూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. చాలామంది తినడానికి ఇష్టపడని ఫుడ్ ఐటమ్స్ వడ్డించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఆ మెనూలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెస్టారెంట్‌లో 700 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.60,000) పెట్టి తిన్న ఒక అమ్మాయి అక్కడి డిఫరెంట్ ఫుడ్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. మిచెలిన్ రెస్టారెంట్‌లో బటర్ ఫ్లై, పురుగులతో చేసిన ఫుడ్, పంది, జింక రక్తం కలిపి చేసిన స్వీట్స్, గొర్రె పిల్ల మెదడు మౌస్, పురుగుల ఐస్ క్రీమ్, జెల్లీ ఫిష్ సూప్, శవపేటిక ఆకారంలో చాక్లెట్, చేపల గుడ్లు, కోడి తల మెనూలో ఉన్నాయని ఆ అమ్మాయి చెప్పింది. దీంతో ఇప్పుడు ఆ విషయాలు వైరల్ గా మారాయి.
ఆ అమ్మాయి షేర్ చేసిన ఈ మెనూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. “డెన్మార్క్‌లోని ఆల్కెమిస్ట్ కోపెన్‌హాగన్‌లో మిచెలిన్ రెస్టారెంట్‌లో నా 5 గంటల, $700 మెనూ లిస్ట్ ఇది” అని ఆ అమ్మాయి చెప్పింది. ఈ స్వీట్ డిష్‌లో పంది, జింక రక్తం నుంచి చేసిన బ్లడ్ డ్రాప్ ట్రీట్ ఉంది. “ఇది కొంచెం మెటాలిక్ టేస్ట్‌తో ఉంది” అని చెప్పింది.
చాలామంది నెటిజన్లు ఈ అమ్మాయి కామెంట్స్‌కు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ''ఇది మోడ్రన్‌గా ఉందని మీరు వాళ్లను నమ్మిస్తే ప్రజలు నిజంగా ఏదైనా తింటారు” అని కొందరు, “ఇది ఆ దేశంలో రెగ్యులర్‌గా వడ్డించే ఫుడ్'' అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
“పుట్టగొడుగులు, సీతాకోకచిలుకలు, జెల్లీఫిష్‌లు, లైవ్ ఇన్సెక్ట్స్, గొర్రె మెదడు, చికెన్ లెగ్స్, చికెన్ హెడ్ అంటూ మెనూ లిస్టే భయంకరంగా ఉంది. దీన్ని ఎలా తింటారో అని ఆలోచించడానికే కష్టంగా ఉంది'' అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు, ''ఈ మెనూలో అన్నీ తినలేని పదార్థాలు ఉన్నాయని చెప్పినా, వీటిలో మంచి ప్రోటీన్ ఉంది'' అని అంటున్నారు.
పులుసు కంటే టేస్టీగా ఉండే తంజావూరు స్పెషల్ కొబ్బరి శోధి.. ఎలా చేయాలో తెలుసా?