ఇంట్లోనే హోటల్ స్టైల్ సాంబార్.. ఇలా చేసేయండి. అందరూ లొట్టలేసుకు తింటారు

Hotel Style Sambar Recipe: ఇంట్లో ఎప్పుడూ చేసే సాంబార్ బోర్ కొడితే కొంచెం కొత్తగా హోటల్ స్టైల్ సాంబార్ ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యులంతా లొట్టలేసుకుంటూ తింటారు. మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. 


ఎప్పడూ ఇంట్లోనే తింటూ హోటల్ లో ఒకసారి ఫుడ్ తినగానే ఎంతో బాగా అనిపిస్తుంది కదా.. వెంటనే ఇంట్లోనే ఇలా చేయాలని మహిళలు అనుకుంటారు. కాని ఆ పదార్థాలకు ఆ టేస్ట్ రావడం లేదని బాధపడుతుంటారు. కాని ఇప్పుడు హోటల్ లో చేసే సాంబార్ ను ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

హోటల్ స్టైల్ సాంబార్ అంటే దాని చిక్కటి పొడి రుచి, గుమగుమలాడే పోపు, కొంచెం తీపి కలిసిన పులుపు, పప్పు మెత్తగా ఉడికిన విధానం అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వాలి. ఇది ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు :

Latest Videos

కందిపప్పు – 1/2 కప్పు
మునగకాయ – 4-5 ముక్కలు
పెద్ద ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలుగా తరిగింది)
టమాటో – 1 (తరిగింది)
దుంపలు – మీ ఇష్టం
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర, కరివేపాకు – అలంకరణ కోసం

మసాలా, పొడి రకాలు : 

సాంబార్ పొడి – 2 టేబుల్ స్పూన్లు (హోటల్ స్టైల్ తేవాలి)
పసుపు – 1/2 టీస్పూన్
కారం – 1/2 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
చింతపండు – చిన్న ఉసిరికాయ సైజు (లేదా చింతపండు రసం 1/2 కప్పు)

పోపు కోసం :

నువ్వుల నూనె (లేదా) నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1/2 టీస్పూన్
మినపప్పు – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
ఎండు మిరపకాయ – 1
ఇంగువ – 1/4 టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా

ఇది కూడా చదవండి పనీర్ నుండి పాలకూర వరకు 7 టేస్టీ వెజ్ కబాబ్స్ ఇలా తయారు చేయండి

తయారీ విధానం :

కందిపప్పును బాగా కడిగి, పసుపు, కొద్దిగా నూనె వేసి కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉండాలి. హోటల్ సాంబార్‌లో ఇది చాలా ముఖ్యం. కుక్కర్ తెరిచిన తర్వాత, పప్పును గరిటెతో బాగా మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 1/2 కప్పుల నీళ్లు పోసి, ఉల్లిపాయ, టమాటో, మునగకాయ, ఇతర కూరగాయలు వేసి ఉడికించాలి. దీనికి చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి. మసాలా వేయడానికి, ఇందులో సాంబార్ పొడి, కారం వేసి మీడియం మంట మీద 7-8 నిమిషాలు బాగా కలపాలి. అందులో మెత్తగా చేసిన పప్పు వేసి, బాగా కలిపి, ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు వేసి, స్టవ్ మీద చాలా తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉంచాలి

పోపు కోసం, వేరే కళాయిలో నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి, ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, ఎండు మిరపకాయ వేసి బాగా వేయించాలి. దీన్ని ఉడుకుతున్న సాంబార్‌లో వేసి, చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి, వాసన వచ్చే వరకు ఉంచాలి.

హోటల్ స్టైల్ సాంబార్‌లో ముఖ్యమైన చిట్కాలు :

పప్పు బాగా మెత్తగా ఉండాలి. మీడియం మంట మీద ఉడికించాలి. పోపు చివరిలో వేస్తే, దాని వాసన, రుచి పూర్తిగా వస్తుంది. పసుపు, సాంబార్ పొడి కొలతలు సరిగ్గా ఉండాలి. కొద్దిగా బెల్లం వేయవచ్చు. ఇది రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.

ఇది కూడా చదవండి ఆంబూర్ బిర్యానీ.. వాసనకే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇలా తయారు చేస్తే అదిరిపోద్ది!

వడ్డించే విధానాలు :

వేడి సాంబార్‌ను ఇడ్లీ, దోశ, ఉప్మా, అటుకులు, అన్నంతో వడ్డించవచ్చు.
అన్నంలో కలుపుకుని తింటుంటే, పైన కొద్దిగా నెయ్యి వేస్తే, రుచి ఇంకా పెరుగుతుంది.
అన్నం, దోశలకు కూడా చాలా బాగుంటుంది.

click me!