‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

By Udayavani DhuliFirst Published Jan 30, 2019, 12:40 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా  తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.వై.ఎస్‌ జీవితంలో ఓ భాగమైన పాదయాత్ర ఘట్టం  ఆధారంగానే తెరకెక్కింది. ఈ చిత్రంలో వైయస్ జగన్ గా ఎవరు వేస్తున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా  తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.వై.ఎస్‌ జీవితంలో ఓ భాగమైన పాదయాత్ర ఘట్టం  ఆధారంగానే తెరకెక్కింది. ఈ చిత్రంలో వైయస్ జగన్ గా ఎవరు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయాలపై దర్శకుడు మహి వి.రాఘవ్‌ క్లారిటీ ఇచ్చారు.

మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ.... వై.ఎస్‌.ఆర్‌.గారిని హీరోగా ప్రజెంట్‌ చేయడానికి నాకు ఇంకొకరిని చిన్నగా చూపించాల్సిన అవసరం రాలేదు. దానివల్ల ఆయన రాజకీయ ప్రత్యర్థులను చూపించాల్సిన అవసరం రాలేదు. ఇందులో చంద్రబాబునాయుడుగారి పాత్ర లేదు. అలాగే వై.ఎస్‌. తనయుడు జగన్‌ పాత్ర కూడా లేదు అని క్లారిటీ ఇచ్చేసారు దర్శకుడు. 

పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు తీయాలనిపించిందో చెప్తూ... ఈ సినిమాలో కేవలం పాదయాత్రకి సంబంధించిన విషయాలే కాదు, కొన్ని ఉప ఘట్టాలూ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు ఎప్పుడూ ఒకరి సమాచారం తెలుసుకోవడానికి సినిమాకి రారు. వినోదం కోసం, భావోద్వేగానుభూతి కోసమే వస్తారు. అందుకు వై.ఎస్‌ జీవితంలోని పాదయాత్ర ఘట్టమైతేనే సరైందనిపించింది. ఆయన మిగతా జీవితాన్నీ పెంచలదాస్‌ పాడిన ఓ పాటలో చూపించే ప్రయత్నం చేశాం అన్నారు. 

దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే నేపథ్యాన్ని తీసుకుని యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. వై.యస్‌.ఆర్‌.గా మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా…మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం...  విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి.రాఘవ్‌ మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు తెలియచేసారు.

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!

click me!