భానుప్రియకు మరిన్ని చిక్కులు: అరెస్ట్ కు డిమాండ్!

Published : Jan 30, 2019, 12:12 PM IST
భానుప్రియకు మరిన్ని చిక్కులు: అరెస్ట్ కు డిమాండ్!

సారాంశం

సినీ నటి భానుప్రియ తన ఇంట్లో మైనర్ బాలిక సంధ్యను పనికి పెట్టుకుంది. సామర్లకోటకు చెందిన ప్రభావతి కూతురైన సంధ్యను గత ఏడాది కాలంలో భానుప్రియ వేధింపులకు గురి చేస్తోందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. 

సినీ నటి భానుప్రియ తన ఇంట్లో మైనర్ బాలిక సంధ్యను పనికి పెట్టుకుంది. సామర్లకోటకు చెందిన ప్రభావతి కూతురైన సంధ్యను గత ఏడాది కాలంలో భానుప్రియ వేధింపులకు గురి చేస్తోందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. 

అంతేకాదు భానుప్రియ సోదరుడు మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తున్నట్లు బాలిక తల్లి ప్రభావతి పోలీసులను ఆశ్రయించింది. విషయం పెద్దది కావడంతో మీడియా ముందుకొచ్చిన భానుప్రియ.. సంధ్యను బాగానే చూసుకుంటున్నామని, ఆమె ఇంట్లో దొంగతనాలు చేస్తుండడంతో ప్రభావతిని పిలిచి వారించామని.. దొంగిలించిన సొమ్ముని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరామని.. దాంతో ప్రభావతి రివర్స్ అయి తమపై కేసు పెట్టిందని భానుప్రియ వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు భానుప్రియపై మరో కేసు పెట్టారు. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం, హింసించడం వంటి నేరాల కింద ఏపీ డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందించింది. దీంతో ఇప్పుడు భానుప్రియ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లుగా కనిపిస్తోంది. 

భానుప్రియపై కేసు: మైనర్ బాలిక స్టేట్మెంట్

చిన్నారిపై వేధింపులు.. స్పందించిన భానుప్రియ!

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిర్వాకం! 

 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే