జూనియర్ పవర్ స్టార్.. స్టైలిష్ లుక్ చూశారా..?

Published : Jan 30, 2019, 11:44 AM IST
జూనియర్ పవర్ స్టార్.. స్టైలిష్ లుక్ చూశారా..?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పవన్ హడావిడి లేక ఆయన అభిమానులు డల్ అయ్యారనే చెప్పాలి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పవన్ హడావిడి లేక ఆయన అభిమానులు డల్ అయ్యారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ లోటుని తగ్గించడానికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ సిద్ధమవుతున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తాజాగా అఖిరానందన్ కి సంబంధించి స్టైలిష్ లుక్ ని చూసిన అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే అఖిరాను జూనియర్ పవర్ స్టార్ అని పిలవొద్దని గతంలో రేణుదేశాయ్ చెప్పింది.

అలా పిలిస్తే వారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ అభిమానులు మాత్రం అఖిరాను చూసి జూనియర్ పవర్ స్టార్ అని పిలవకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశాడు అఖిరా.

అయితే అతడిని హీరోగా పరిచయం చేస్తారా..? లేదా..? అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ అఖిరా ఫోటోలను చూస్తోన్న అభిమానులు మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని  కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది