అదేదో పవన్ ని తీసుకోవచ్చుగా .. ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్‌

By Surya PrakashFirst Published Mar 25, 2020, 6:34 PM IST
Highlights

పవన్ ని తీసుకుంటే ఖచ్చితంగా  నిజ జీవితం తెరపై చూసినట్లు ఉండేదని అంటున్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం కూడా తెరపై ఆవిష్కారం అయ్యేదని చెప్తున్నారు. ఇలాంటి పాత్రలు పవన్ చేస్తే వచ్చే కిక్కే వేరు అని చెప్తున్నారు. 

అభిమానులకు కొన్ని ఆశలుంటాయి. నిర్మాతకు కొన్ని లెక్కలుంటాయి. హీరోలకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా కలిస్తేనే ఓ ప్రాజెక్టు సేఫ్ గా పట్టాలెక్కి, సినిమా సూపర్ హిట్ అవుతుంది. తాజాగా పవన్ కల్యాణ్, చిరు కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఊహ కొందరు అభిమానులకు కలిగింది. అందుకు కారణం ఆచార్య చిత్రం. ఆచార్యలో సెకండాఫ్ లో వచ్చే మరో హీరో క్యారక్టరైజేషన్. ఆవేశంతో రగిలిపోతూ..మాజీ నక్సలైట్ గా కనపడుతూ..స్పూర్తి నిచ్చే పాత్ర అది. పవన్ లాంటి ఆలోచన, ఆవేశం ఉన్నవాడు తగ్గ పాత్ర అది. దాంతో పవన్ ఎందుకు చేయకూడదు అంటూ కొందరు ఫ్యాన్స్ ప్రశ్నించటం మొదలెట్టారు. అయితే ఆ పాత్రకు ఆల్రెడీ రామ్ చరణ్ ని తీసేసుకున్నారు.

కానీ పవన్ ని తీసుకుంటే ఖచ్చితంగా  నిజ జీవితం తెరపై చూసినట్లు ఉండేదని అంటున్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం కూడా తెరపై ఆవిష్కారం అయ్యేదని చెప్తున్నారు. ఇలాంటి పాత్రలు పవన్ చేస్తే వచ్చే కిక్కే వేరు అని చెప్తున్నారు. ఎమోషనల్ గా తెరపై పవన్ ...రియాక్ట్ అయ్యే తీరు రియాక్టర్స్ ని తలపిస్తుందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కొరటాల శివ ఆలోచించలేదా.. అంటే ఖచ్చితంగా ఈ ఐడియా వచ్చే ఉండి ఉంటుంది. అయితే సినిమా బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ తోనే ఆ పాత్ర చేయిస్తున్నట్లు చెప్తున్నారు.
  
ఇక రామ్ చరణ్ పాత్ర స్ఫూర్తితోనే 'ఆచార్య' తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఈ తరహా పాత్రలంటే ఇష్టం. గతంలోనూ  జల్సా సినిమాలో నక్సలైట్ పాత్ర చేసిన అనుభవం పవన్ కళ్యాణ్ కు ఉంది. ఇది పవన్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ అనిపిస్తున్నా కానీ ఎందుకో చరణ్ తోనే వెళ్ళటమే చాలా మందికి నచ్చటం లేదు. అయితే ముందే అనుకున్నట్లు సినిమా అంటే సవాలక్ష లెక్కలు.

click me!