వెంకీ, సూర్య, మోహన్‌లాల్‌ ఆవిష్కరించిన `అనబెల్‌ & సేతుపతి` ట్రైలర్‌..

By Aithagoni RajuFirst Published Aug 30, 2021, 5:37 PM IST
Highlights

విజయ్‌ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన `అనబెల్‌ అండ్‌ సేతుపతి` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఒకేసారి మూడు భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. తెలుగులో వెంకటేష్‌ విడుదల చేయగా, తమిళంలో సూ్య, మలయాళంలో మోహన్‌లాల్‌ ఆవిష్కరించారు.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా 'అనబెల్ & సేతుపతి'. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్‌ ఆసాంతం చాలా ఆసక్తికరంగా ఉందంటూ మెచ్చుకున్నారు వెంకటేష్. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. 

ఒకేసారి మూడు భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. తెలుగులో వెంకటేష్‌ విడుదల చేయగా, తమిళంలో సూ్య, మలయాళంలో మోహన్‌లాల్‌ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా 'అనబెల్ & సేతుపతి'  చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ అంతా విజయ్ సేతుపతి, తాప్సీ చుట్టూనే తిరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్‌లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో 'అనబెల్ & సేతుపతి' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, యోగి బాబు, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దీపక్ సుందరరాజన్. నిర్మాతలు: సుధాన్ సుందరం, జి జయరాం. 

click me!