ఇక్కడి నుండి ఇండియాకు సందేశం ఇస్తా... లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో!

By Sambi ReddyFirst Published Aug 20, 2022, 11:18 PM IST
Highlights

లైగర్ ప్రీ రిలీజ్ వేడుకలో తన స్పీచ్ షార్ట్ గా ముగించాడు విజయ్  దేవరకొండ. ఈవెంట్ కి చాలా ఆలస్యంగా హాజరైన టీం ఒకింత ఆడియన్స్ ని నిరాశపరిచాడు. లైగర్ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ తప్పక చూడాలని ఆయన కోరారు.

లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు భారీ రెస్పాన్స్ దక్కింది. కాలేజీ స్టూడెంట్స్  తో పాటు యువత పెద్ద ఎత్తున  హాజరయ్యారు. డాన్స్, సింగింగ్ ఈవెంట్స్ తో షో ఎంటర్టైనింగ్ గా సాగింది. అయితే అక్కడకు వచ్చిన ఆడియన్స్ మాత్రం హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కోసం ఎదురుచూశారు. వారు వేదిక వద్దకు తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చారు. పది గంటల వరకే పర్మిషన్ ఉండగా హడావుడిగా ముగించారు. హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరి మాట్లాడిన తర్వాత విజయ్ దేవరకొండ మైక్ తీసుకున్నారు. తన ఫ్యాన్స్ తో పాటు గుంటూరు ప్రజల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అలాగే లైగర్ మూవీ తప్పకుండా చూడాలని పిలుపునిచ్చారు.

విజయ్ తన స్పీచ్ లో... మీతో ఎప్పటి నుండో మాట్లాడాలని అనుకుంటున్నా. ఇవాళ అవకాశం వచ్చింది. ఐతే ఈ మధ్యలో ఓ డ్రామా. ప్రమోషన్స్ కోసం అనేక నగరాలు తిరిగాము. రకరకాల ఫుడ్ తినడం వలన హెల్త్ పాడైంది. అయితే నేను ఇక్కడ ఉన్నానంటే అది మీరు చూపించిన ప్రేమ కారణంగానే. నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. తిరిగి నేను కూడా మీకు మంచి జ్ఞాపకాలు ఇవ్వాలి. లైగర్ మూవీతో అది చేయబోతున్నాడు. నా కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో లైగర్ తెరకెక్కింది. 

లైగర్ కథ నేను వింటున్నప్పుడు పూరి, ఛార్మి నా వైపే చూస్తున్నారు. అసలు వీడు ఏం అంటాడనే నా రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను మెంటల్ అనిపించిందని. ఈ సినిమా మా వాళ్లకు ఎప్పుడు చూపిస్తానా అనిపించేది. షూటింగ్ టైం లో కూడా నేను అనుకునేవాడిని ఈ సీన్ మావాళ్లకు బాగా నచ్చుతుంది, చూపించాలని. కానీ ఈ మూవీ పూర్తి కావడానికి మూడేళ్ళ సమయం పట్టింది. మరో ఐదు రోజుల్లో మీ ముందుకు రానుంది.

నాకు మీరు చేయాల్సింది ఒకటే... ఆగస్టు 25న గుంటూరుని షేక్ చేయాలి. మీరు అనుమతిస్తే గుంటూరు నుండి ఇండియాకి సందేశం ఇస్తా. ఐ లవ్ యి ఆల్, థాంక్స్ అంటూ... విజయ్ దేవరకొండ ముగించాడు. ఒకవైపు లైగర్ బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తుండగా... గుంటూరు సభలో విజయ్ పద్దతిగా ఉన్నట్లు అనిపించింది. డ్రెస్సింగ్ నుండి మాట తీరు వరకు పొలైట్ గా ప్రవర్తించాడు. ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించిన దాఖలాలు లేవు. మొత్తంగా యూత్ ని ఆకర్షించేలా స్పీచ్ సాగింది.
 

click me!